పవన్ ను అల్లు అర్జున్ బాబాయ్ అని ఎందుకన్నాడంటే? కారణమిదేనన్న జనసేన నేత..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూ, ఆయన మేనమామ సోదరుడు అయిన పవన్ కళ్యాణ్ కు మధ్య కొంతకాలంగా నెలకొన్న గ్యాప్ తగ్గించేందుకు తాజాగా ప్రయత్నించారు. తన తాజా చిత్రం పుష్ప 2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి గతంలోనే ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అంటూ అల్లు అర్జున్ పిలిచిన పిలుపు చర్చనీయాంశమైంది.

తన తండ్రి అల్లు అరవింద్ కు సోదరి అయిన మేనత్త సురేఖకు భర్త అయిన చిరంజీవికి సోదరుడైన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కు వరసకు మేనమామే అవుతారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ను బాబాయ్ గా సంబోధించడంతో అక్కడున్న వారితో పాటు అభిమానులూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కారణం లేకుండా ఏదీ చేయడనే పేరున్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో తనకు ఉందని భావిస్తున్న వైరానికి పుల్ స్టాప్ పెడుతూనే ఇలా బాబాయ్ అంటూ కలుపుకోవడం చర్చకు కారణమైంది.

why allu arjun called pawan kalyan as uncle janasena leader satya revealed reason

దీనిపై జనసేన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ లో స్పందించారు. పవన్ కళ్యాణ్ ను బాబాయ్ గా అల్లు అర్జున్ సంబోధించడం వెనుక కారణాన్ని ఆయన బయటపెట్టారు. భారీ బడ్జెట్ సినిమా పుష్పకి స్పెషల్ జిఓ ఇచ్చి రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారని సత్య తెలిపారు. అయితే కళ్యాణ్ గారిని బాబాయ్ అని సంబోధించడానికి కారణం బహుశా బన్నీ చిన్నపటి నుండి సినిమా పరంగా చిరంజీవి గారిని తండ్రి గాను కళ్యాణ్ గారిని బాబాయి గాను భావిస్తూ ఉండడమే..అని ఆయన అన్నారు.

చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో తను ఒక శిఖరంలా ఎదగడమే కాకుండా, క్రమశిక్షణతో స్వయంకృషితో ఎదిగేలా చేసి అనితర సాధ్యమైన పర్వత శ్రేణి తయారుచేసి సినీ పరిశ్రమకి, మెగా కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్ గా నిలిచారని, ఏది ఏమైనా ముఖ్యమంత్రి పదవి నుండి వైఎస్ జగన్ నిష్క్రమణతో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుందని బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+