అలీ కుమార్తె వివాహానికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లలేదంటే..?

ఏపీ ప్రభుత్వ సలహాదారు, నటుడు అలీ కుమార్తె ఫాతిమా వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరులో నిర్వహించిన రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తో పాటూ ప్రముఖులు హాజరయ్యారు. అలీ కుమార్తె వివాహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవలేదు. అలీ వైసీపీలో ఉండటంవల్లే వెళ్లలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

10 నుంచి బాధ్యతలు స్వీకరిస్తా

10 నుంచి బాధ్యతలు స్వీకరిస్తా

ఓ న్యూస్ ఛానల్ తో ఈ విషయమై అలీ మాట్లాడుతూ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. తన కుమార్తె వివాహం బాగా జరిగిందని, వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన కుమార్తె జన్మదినానికి చిరంజీవి వచ్చారని, మళ్లీ ఆమె వివాహానికి హాజరుకావడం ఆనందాన్నిచ్చిందన్నారు. కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంవల్ల బాధ్యతలు స్వీకరించలేదని, ఈనెల 10 నుంచి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తానన్నారు.

విమానం మిస్ అవడంవల్ల

విమానం మిస్ అవడంవల్ల

పవన్ కల్యాణ్ తన కుమార్తెవివాహానికి కచ్చితంగా హాజరయ్యేవారని, కానీ దురదృష్టవశాత్తూ విమానం మిస్ అయ్యిందన్నారు. తర్వాత ఈ విషయాన్ని ఫోన్ చేసి తెలిపారని, మళ్లీ కలుస్తానన్నారని చెప్పారు. పవన్ హాజరయ్యేందుకు వీలుగా ఆయన సెక్యూరిటీ వచ్చి ఒకసారి ఇక్కడి ఏర్పాట్లు చూసుకున్నారని వివరించారు. రాలేకపోయినందుకు ఫోన్ చేశారని, తర్వాత అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఇంటికి వచ్చిన సమయంలో ఒకసారి ఫోన్ చేస్తే వస్తానన్నారని అలీ స్పష్టం చేశారు. సలహాదారు పదవితోపాటు సినిమాలు, షోలు చేస్తుంటానన్నారు.

క్లారిటీ ఇచ్చిన అలీ, పవన్ కల్యాణ్

క్లారిటీ ఇచ్చిన అలీ, పవన్ కల్యాణ్

అలీ, పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ మంచి స్నేహితులు, పవన్ ప్రతి సినిమాలో అలీకి ఒక క్యారెక్టర్ సృష్టిస్తారు. తర్వాత ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం, పవన్ జనసేన పార్టీతో బిజీగా ఉంటే 2019 ఎన్నికల్లో అలీ వైసీపీవైపుకు వెళ్లారు.

రాజకీయాలవల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్ ఇటీవలి సినిమాల్లో అలీ కనిపించడంలేదు. దీంతో రాజకీయాలు వేరుగా చూసి ఇద్దరిమధ్య సయోధ్య కుదర్చాలని కొందరు ప్రయత్నించారు. అయితే రాజకీయాలకు, తమ స్నేహానికి సంబంధం లేదని పవన్ తోపాటు అలీ కూడా క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+