Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయ్యారు ఎందుకు ? ఎవరేం మాట్లాడినా స్పందించరేం ?

వైసిపి నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయిపోయారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీ లకు చుక్కలు చూపించే రోజా ఎన్నికలు ముగిసిన నాటినుండి నేటి వరకు మాట్లాడటమే మానేశారు. ఒకపక్క టిడిపి నేతలు వైసీపీ అధినేత జగన్ పై మాటల దాడికి దిగుతున్నా రోజా మాత్రం సైలెంట్ గా చూస్తున్నారు. జగన్ ని ఎవరైనా ఒక్క మాట అంటే చాలు విరుచుకుపడ్డ రోజా ప్రస్తుతం ఇలా మౌనం దాల్చడానికి కారణమేంటి? రోజా కు ఏమైంది ? అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన రోజా

ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన రోజా

ఏపీ రాజకీయాల్లో ఆమె ఓ ఫైర్ బ్రాండ్. తనకంటూ ఓ ఇమేజ్ తో దూసుకుపోతున్న ఎమ్మెల్యే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కీలక నేత రోజా సెల్వమణి. ఎన్నికల ప్రచారం ముందు వరకు అధికార పార్టీ పైన తనదైన శైలిలో విరుచుకుపడిన రోజా ఎన్నికల అనంతరం సైలెంట్ అయిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి టూర్ వెళ్లి వచ్చిన రోజా ఆ తర్వాత కూడా మాట్లాడ్డం మానేశారు. టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని, దివ్యవాణి లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై చాలా ఘాటైన విమర్శలు చేస్తున్నా రోజా మాత్రం నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.

నగరి ఎన్నికల టెన్షన్ లో ఉన్న రోజా .. ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడతారా ?

నగరి ఎన్నికల టెన్షన్ లో ఉన్న రోజా .. ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడతారా ?

ఇంతకుముందు ఎవరేం మాట్లాడినా వెంటనే స్పందించి రోజా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొందరపడి ఏ ఒక్క మాట మాట్లాడడం లేదు. సోదరుడిగా భావించే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు టిడిపి నేతలు అనరాని మాటలు అంటున్నా రోజా మాత్రం చూస్తూ మిన్నకున్నారు. నగరి నియోజకవర్గంలో పోటీ చేసిన రోజా ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకింత టెన్షన్ కు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలు చూసిన అనంతరం అప్పటి రాజకీయ పరిణామాలను బట్టి, పరిస్థితులను బట్టి మాట్లాడాలని నిర్ణయించుకుంది కాబోలు అని రోజా మౌనంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రోజా మౌనం వెనుక వ్యూహాత్మక కారణాలు ఏమైనా ఉన్నాయా ?

రోజా మౌనం వెనుక వ్యూహాత్మక కారణాలు ఏమైనా ఉన్నాయా ?

ఏదేమైనా ఎప్పుడు ఫైర్ బ్రాండ్ లా ప్రత్యర్థి పార్టీల మీద విరుచుకుపడే రోజా ఇలా సైలెంట్ గా ఉండడం మాత్రం ఎవరికీ నచ్చటం లేదు.

అటు రోజా వ్యవహారశైలితో టిడిపి నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నోరు తెరిస్తే చాలు చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడే రోజా ఇంత సైలెంట్ గా ఉండడం ఇదే మొదటిసారి కాబోలు. ఎవరు వద్దని వారించినా టిడిపి పై విరుచుకుపడ్డ రోజా, ఇప్పుడు ఇంత కామ్ గా ఉండడంతో రోజా మౌనం వెనుక ఏదో వ్యూహం ఉందని పెద్ద చర్చజరుగుతుంది. అసలు రోజా వ్యూహమేంటి అనేది మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత తెలిసే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+