Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vijayawada West: మైనార్టీల కోటలో సుజనా పాగా వేయగలరా ? తాజా లెక్కలేంటి.. ?

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతున్న అసెంబ్లీ సీట్లలో విజయవాడ పశ్చిమ సీటు కూడా ఒకటి. ఇందులో భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లు కూటమి అభ్యర్ధిగా బరిలోకి దిగిన బీజేపీ నేత సుజనా చౌదరికి గట్టి సవాల్ విసురుతున్నారు. సంప్రదాయ వైసీపీ ఓటు బ్యాంకు అయిన వీరంతా ఆ పార్టీ నిలబెట్టిన మైనార్టీ అభ్యర్ధి షేక్ ఆసిఫ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే కమ్మ, బీసీ వర్గాల నుంచి లభిస్తున్న మద్దతుతో పాటు ఆర్ఝిక బలంతో సుజనా ధీమాగా ఉన్నారు.

విజయవాడ పశ్చిమ సీటులో గతంలో జలీల్ ఖాన్ తో పాటు పలువురు ముస్లిం అభ్యర్ధులు వరుస విజయాలు సాధించారు. ఇక్కడ దాదాపు 40 వేలకు పైగా ఉన్న ముస్లిం ఓటర్లతో పాటు క్రిస్టియన్ ఓటర్లు ఎటువైపు మొగ్గితే అటే విజయం వరిస్తుందనే అంచనా ఉండేది. గత ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉన్న వీరంతా మద్దతివ్వడంతో సునాయాసంగా గెలిచారు. అయితే ఈసారి ఆయన్ను తప్పించి నేరుగా ముస్లిం అభ్యర్ధికే జగన్ టికెట్ ఇచ్చారు. అయితే మాజీ కార్పోరేటర్ అయిన ఆసిఫ్ ఆర్ధికంగా బలవంతుడు కాకపోవడం మైనస్ గా మారింది.

will bjp s sujana Chowdary capture minority populated Vijayawada west seat

ఆసిఫ్ కు పోటీగా దిగే అభ్యర్ధిని బట్టి విజయవాడ పశ్చిమ సీటులో ఫలితం డిసైడ్ అయ్యే పరిస్ధితి నెలకున్న వేళ కూటమి అభ్యర్ధిగా బీజేపీ నేత సుజనా చౌదరి టికెట్ తెచ్చుకున్నారు. సమీకరణాల్లో భాగంగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి ఆయన పార్టీ బీజేపీ మైనస్ గా మారింది. బీజేపీ కాకుండా ఆయన టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఉంటే ఫలితం ఆయనకు పూర్తిగా అనుకూలంగా ఉండేదన్న భావన నెలకొంది.

అయితే ఇక్కడ భారీసంఖ్యలో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక తెస్తే తప్ప విజయం కష్టమని లెక్కతో టీడీపీ నేతలు జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్ వంటి వారిని సుజనా తనవైపు తిప్పుకున్నారు. వారిని పూర్తిస్దాయిలో క్షేత్రస్దాయిలో పనిచేసేలా ఒప్పించారు. దీంతో ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక కనిపిస్తోంది. అయితే అది సుజనాను గెలిపించే స్ధాయిలో లేదన్నది నిర్వివాదాంశం. ఇతర సామాజిక వర్గాల ఓట్లు పూర్తి స్దాయిలో దక్కించుకోగలిగితే సుజనా చౌదరి కనీస మెజార్టీతో బయటపడే అవకాశం ఉంది.తాజా లెక్కల ప్రకారం సుజనా 3 వేల ఓట్లతో బయటపడతారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

మరోవైపు మైనార్టీల నుంచి లభిస్తున్న పూర్తి సహాయ సహకారాలతో వైసీపీ అభ్యర్ధి ఆసిఫ్ పని సులువవుతోంది. కానీ ఎన్నికల్లో డబ్బుల్లేకుండా గెలిచే పరిస్ధితి లేదు. సుజనాకు పోటీగా ఈసారి ఆయన డబ్బులు పంచగలిగితేనే గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చని స్థానికులు చెప్తున్నారు. దీంతో సుజనా చౌదరివైపు కాస్త మొగ్గు కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+