నో డౌట్: పోలవరంపై చంద్రబాబు వ్యూహాత్మకంగా...

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రదాయిని 'పోలవరం' ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి మూడేళ్లు దాటింది.

కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మాత్రం ముందుకు పడలేదు. దీనికి తోడు వ్యయం పెరుగుతున్నదని, దాన్ని నిర్ధారించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రస్తుత అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మానానికి రమారమీ రూ. 40 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా ఏపీ తేల్చింది. కానీ ఐదేళ్లలోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుంటే తాము విడుదల చేసే నిధులు అప్పుగా మారిపోతాయని ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.

రూ.1981. 54 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిందని ఉండవల్లి ప్రకటన. 2018 మార్చి నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి తమకు అప్పగించాలని కూడా కేంద్రం హెచ్చరించిందని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి ప్రాజెక్టు నిర్మాణంపై తాజా పరిస్థితిపై ఈ నెలాఖరుకల్లా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం 'పోలవరం ప్రాజెక్టు' నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేస్తుందా? అన్నది అనుమానంగానే ఉన్నది.

పురుషోత్తమ ఎత్తిపోతల పథకంపై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పురుషోత్తమ ఎత్తిపోతల పథకంపై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

కానీ చంద్రబాబు ప్రభుత్వ వైఖరి మరోలా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాదని, రాష్ట్రానికి మాత్రమే దానిపై హక్కు ఉండాలని నినదిస్తూ వస్తున్నారు. ఇటీవలి వారం వారం ప్రాజెక్టు పనితీరును సమీక్షించిన చంద్రబాబు గత వారం తూర్పు గోదావరి జిల్లాలో పురుషోత్తమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను సమీక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని అన్నారు.

Malladi Vishnu, Sunkara Padma, Devineni Uma : War Of Words about Polavaram Project - Oneindia Telugu
రైతుల సహకారంతో ఉభయ గోదావరి జిల్లాలు, క్రుష్ణా, విశాఖ జిల్లాలకు ఇలా

రైతుల సహకారంతో ఉభయ గోదావరి జిల్లాలు, క్రుష్ణా, విశాఖ జిల్లాలకు ఇలా

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి డెల్టాతో నీటి ఎద్దడి శాశ్వతంగా పరిష్కారమవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం, ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా - గోదావరి డెల్టా, విశాఖ జిల్లాకు నీరందిస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు సరఫరా చేయడానికి రైతులు సహకరిస్తున్నారని చంద్రబాబు సెలవిచ్చారు. ఈ నెల 15వ తేదీ నాటికి పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం కింద రెండు పైపులైన్ల ద్వారా ఏలేరు జలాశయానికి నీరు సరఫరా చేస్తామని చెప్పారు. ఇతర ఎత్తిపోతల పథకాల క్రింద కృష్ణా - గోదావరి డెల్టా, విశాఖ జిల్లాకు నీరందిస్తామన్నారు.

1995 - 2004 మధ్య పోలవరం ఊసే ఎత్తని బాబు

1995 - 2004 మధ్య పోలవరం ఊసే ఎత్తని బాబు

కానీ ఆ ఎత్తిపోతల పథకాలేమిటన్న సంగతి మాత్రం ఆయన ప్రకటించలేదు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే తన ఊపిరి అని అందుకు తన శాయశక్తులా క్రుషి చేస్తానన్నారు. అధికారులే తమ అభిమతాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాలో 14లక్షల ఎకరాల్లో పంటలకు నీరిచ్చి అద్భుతమైన ఫలితాలను సాధించినట్టు చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల బహుళ ప్రయోజనాలు కల్గిన భారీ నీటి పారుదల పథకమన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలోని మెట్ట ప్రాంతానికి సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంతో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మభ్యపెట్టిందని ఆరోపణలకు దిగిన సీఎం చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఊసే ఎత్తలేదు.

2004లో వైఎస్ సీఎం అయ్యాకే పోలవరం ఇలా

2004లో వైఎస్ సీఎం అయ్యాకే పోలవరం ఇలా

1996 నుంచి 2004 వరకు తొలుత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, బీజేపీ సీనియర్ నేత వాజ్ పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1996లో అప్పటి ప్రధాని హెచ్ డీ దేవెగౌడ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, నివేదిక పంపాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. కానీ ఉలుకూ పలుకూ లేదు. ఈ సంగతి అప్పుడే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ఇటీవలే బయట పెట్టారు. కానీ టంగుటూరి అంజయ్య రాష్ట్ర సీఎంగా పనిచేసింది అతి తక్కువ కాలం. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోవడమే కాదు 30 ఏళ్లు గడిచిపోయాయి.

2014 తర్వాతే పోలవరానికి మోక్షం

2014 తర్వాతే పోలవరానికి మోక్షం

తిరిగి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణానికి ఉత్తరాంధ్రలో వంశధార, తోటపల్లి ప్రాజెక్టులు.. తుంగభద్ర, పెన్నా నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వంశధార, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు కావడంతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డంకులు చెప్తూ వస్తున్నాయి. కానీ 2014 తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ సంగతులన్నీ విస్మరించి ప్రతిపక్ష నేతగా 2004 నుంచి 2014 వరకు రైతుల పక్షాన పోరాడానని ప్రకటిస్తున్న చంద్రబాబు.. నాడు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలకు తాగు, సాగునీరు సరఫరా కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ శంకుస్థాపన చేశారన్న సంగతిని ఏపీ సీఎం చంద్రబాబు విస్మరించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు స్వార్థపరులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పరోక్షంగా వైఎస్ తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డిపై విమర్శలు గుప్పించడమే లక్షంగా పెట్టుకున్నారు.

మూడు నెలల్లో ప్రారంభించే ప్రాజెక్టులేవి?

మూడు నెలల్లో ప్రారంభించే ప్రాజెక్టులేవి?

ఇటువంటి అనుమానాల మధ్య చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా తొలి విడతలో 67 వేల ఎకరాల ఏలేరు ఆయకట్టుకు, రెండో దశ పూర్తి చేసి రెండు జిల్లాల పరిధిలో 2.15 లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు ఏలేరులో 24 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటిని ఉంచుతామని అన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో 28 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రారంభిస్తామని మరో సందర్భంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఏయే ప్రాజెక్టులు పూర్తి చేస్తారన్న విషయం మాత్రం చెప్పకపోవడం గమనార్హం. ఇక పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ పై చంద్రబాబు సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందా? అన్నదీ అనుమానమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandra Babu Naidu said that his government will complete 28 irrigation projects while Undavalli Arun Kumar objected State government stance and raises the some doubts on Polavaram project completions
Please Wait while comments are loading...