బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమా స్టారా..? పొలిటికల్ స్టారా..? వేణుస్వామి క్లారిటీ

ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999'సినిమాలో మోక్షజ్ఞ నటిస్తారని ఇలా ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి

నందమూరి మోక్షజ్ఞ.. చాలాకాలం నుంచి ఈ హీరోపేరు నందమూరి అభిమానుల్లో నానుతోంది. బాలకృష్ణ తనయుడైన మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలామంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మోక్షజ్ఞ చేసే సినిమా బాలకృష్ణ దర్శకత్వంలో ఉంటుందని, కొంతమంది ఆ సినిమాలో బాలకృష్ణ కీలకపాత్రలో నటిస్తారని, మరికొందరు బాలయ్య విలన్ పాత్ర పోషిస్తారంటూ ఇప్పటికే ఎన్నో ప్రచారాలు చేశారు.

ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999'సినిమాలో మోక్షజ్ఞ నటిస్తారని ఇలా ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆయన మాత్రం సినీ ఇండస్ట్రీలో అడుగు ఎప్పుడు పెడతారో ఎవరికీ తెలియడంలేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venuswamy) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మోక్షజ్ఞ సినీ కెరియర్ గురించి చెప్పారు.

Will Mokshagna son of Balakrishna succeed in politics-Here is what astrologer Venu swami predicts

వేణు స్వామి మాట్లాడుతూ.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఆలస్యంగా ఉంటుంది కానీ ఆయన సినీ పరిశ్రమకు రావడం మాత్రం పక్కా అని, అతను కూడా కూడా నందమూరి హీరోలలో ఒకరిగా విజయవంతమవుతాడని తెలిపారు. నందమూరి కుటుంబంలో సినిమాతోపాటు రాజకీయం కూడా ఉంటుందని, అయితే మోక్షజ్ఞ రాజకీయాల్లోకి వెళ్లినా అంతగా ఫలితం ఉండదని చెప్పారు. రాజకీయాలు మోక్షజ్ఞ కు అచ్చిరావని, సినిమాల్లో మాత్రం పెద్ద స్టార్ అవుతాడని కాకపోతే రావడం ఆలస్యమవుతుందని చెప్పారు. అతను కూడా అతని తండ్రిలాగే మంచి స్టార్ డమ్ సంపాదించుకుంటారంటూ వేణుస్వామి మోక్షజ్ఞ జాతకం గురించి, సినీ కెరీర్ గురించి, రాజకీయ కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోక్షజ్ఞ గురించి వేణుస్వామి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+