పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? రేణూ దేశాయ్ షాకింగ్ రిప్లై!!
మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చి వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు రేణు దేశాయ్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రేణు దేశాయ్ స్పందిస్తూ తనకు ఈ క్వశ్చన్ ఏ వద్దు అన్నారు. ఆయన సీఎం అవుతారా లేదా అన్నది తనకు సంబంధం లేని విషయమని, తాను ఏమీ కోరుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలా వద్దా అనేది దేవుడు నిర్ణయిస్తారని దాని గురించి చెప్పడానికి తాను ఎవరు అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.

ఎవరికి ఏం రాసి ఉందో అదే జరుగుతుందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోరా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందించారు. నేను ఎవరి గురించి ఎలాంటి స్టాండు తీసుకోను అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు. అన్ని నిజాలే చెప్పానని, మా విడాకుల గురించి మొన్న మాట్లాడినప్పుడు కూడా అన్ని నిజాలే చెప్పానని రేణు దేశాయ్ తెలిపారు.
నేను చెప్పినవి నిజాలా .. కాదా అన్నది లై డిటెక్టర్ పెట్టి టెస్ట్ చేసుకోమని రేణు దేశాయ్ అన్నారు. ఎవరి గురించి తాను క్యాంపెయిన్ చేయనని, తన మనసుకు అనిపించింది మాత్రమే తాను చెప్పానని, దానికంటే ఎక్కువ, తక్కువ చెప్పడానికి ఇంకేమీ లేవని రేణు దేశాయ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగానే రేణు దేశాయ్ మాట్లాడినట్టుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications