ఏపీలో టిడిపి-బిజెపి క్లియర్: పవన్ కళ్యాణ్‌పై అనుమానాలు!
విజయవాడ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో రసవత్తరమైన రాజకీయానికి తెరలేవనుందని, బిజెపి, టిడిపిలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన సోదరుడు చిరంజీవి వైపు మొగ్గే అవకాశాలు లేకపోలేదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రధానంగా, నవ్యాంధ్ర ఏపీకి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. మరోవైపు, కేంద్రం సహకరిస్తుందని, మరింత సాయం చేస్తుందని బిజెపి కౌంటర్ ఇస్తోంది. అదే సమయంలో 2019 నాటికి బిజెపి ఏపీలో కీలకంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు పావులు కదుపుతోంది.
ఇంకోవైపు, కాపు వర్గాన్ని మచ్చిక చేసుకోవాలని భావిస్తున్న బిజెపికి టిడిపి షాకిస్తోంది. ఆ వర్గానికి చెందిన నేతలను వరుసగా తమ పార్టీలో చేర్పించుకుంటూ టిడిపి దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో 2019లో బిజెపి, టిడిపి వేర్వేరుగా పోటీ, పవన్ కళ్యాణ్ మద్దతు ఎవరికో.. అంటూ చర్చ సాగుతోంది.

నరేంద్ర మోడీ
కానీ తాజాగా, బిజెపి నేతలు కామినేని శ్రీనివాస రాజు (ఏపీ మంత్రి), శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజులు టిడిపి - బిజెపి మధ్య పొత్తు విచ్చిన్నం వార్తలను కొట్టి పారేశారు. దీంతో పొత్తుకు చెల్లు అనే ఊహాగానాలకు ఓ విధంగా ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పవచ్చు. కానీ అది ఎంత వరకు సాధ్యమనే చర్చ సాగుతోంది. ఏపీకి అవసరమున్నంత వరకు టిడిపి - బిజెపి మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు.

చంద్రబాబు నాయుడు
బిజెపి నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రం నుంచి ఏపీకి సాయం అవసరమైన నేపథ్యంలో పొత్తు కొనసాగించేందుకే ఆసక్తి చూపిస్తుంది. బిజెపి నేతల వ్యాఖ్యలు, ఏపీకి కేంద్రం అవసరం దృష్ట్యా టిడిపి వైఖరిని చూస్తుంటే 2019 ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తుతో కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్
బిజెపి - టిడిపి కలిసే వెళ్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో (2014) ఆ కూటమికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ఎటు వైపు ఉంటారనే ఆసక్తికర చర్చ మాత్రం ఇంకా రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ కులాలకు దూరంగా ఉన్నప్పటికీ... ఆయన ఎటువైపు ఉంటే అటువైపు కాపు ఓటు బ్యాంకు కొంతమేర నడుస్తుందనే వాదనలో వాస్తవం ఉందని అంటున్నారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సమయంలో చేసిన వ్యాఖ్యలను బట్టి.. కాంగ్రెస్ తన సోదరుడు చిరును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయనకు అండగా నిలబడతారా? కాంగ్రెస్ పార్టీకి ఎంత బద్ద వ్యతిరేకి అయినా అన్నయ్య కోసం తగ్గక తప్పదనే వాదనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ దూరం జరిగినా పక్కా ప్రణాళికతో వెళ్లేందుకు టిడిపి - బిజెపిలు పావులు కదుపుతున్నాయని తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications