ఏపీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్న ఏపీ పోలీస్ యంత్రాంగం, ఈ నేపథ్యంలో బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నట్టు ఏపీ డీజీపీ వెల్లడించారు.

ఏపీలో మళ్ళీ మూడు రోజులు మద్యం షాపులు బంద్
రాష్ట్రంలో 3,4,5 తేదీలలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఇక ఇదే విషయాన్ని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.జూన్ 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని డీజిపి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో తనిఖీలను చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

Wine shops closure for three days gives a Shock for alcohol lovers in andhra pradesh

కౌంటింగ్ నేపధ్యంలో కీలక నిర్ణయం
జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో మద్యం సేవించి ఎటువంటి గొడవలు జరగకుండా మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్టు వెల్లడించారు. కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని ఎటువంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించడానికి, బాణాసంచా పేల్చటానికి అనుమతి లేదని డిజిపి హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
సోషల్ మీడియా వేదికగా ఎవరైనా గొడవలను ప్రేరేపించే తప్పుడు ప్రచారం చేసిన, తప్పుడు వార్తలను ప్రకటించినా సహించేది లేదని కఠినచర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పైన నిఘా కొనసాగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఏపీలో కౌంటింగ్ సందర్భంగా హింసాత్మకఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఎన్నికలసంఘంతో పాటు, పోలీసులు కౌంటింగ్ సజావుగా సాగడానికి పలు చర్యలను చేపట్టారు.

ఏపీలో జూన్ 15 వరకు భద్రత.. రంగంలో కేంద్ర బలగాలు
ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలలో నిఘా పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సందర్భంగా గొడవలు చోటు చేసుకున్న జిల్లాలలో అనేక చోట్ల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి అదనపు బలగాలను సైతం రాష్ట్రంలో రంగంలోకి దించారు. జూన్ 15 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిఘా కొనసాగించాలన్న కేంద్ర ఇంటెలిజెన్స్ సూచనలతో తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+