బస్సులో బిడ్డను కన్న మహిళ: కంప్యూటర్లు దగ్ధం

అనంతపురం/ కడప/ విశాఖ :ఆర్టీసీ బస్సులో ఓ గర్భిణి ప్రసవించిన సంఘటన శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా హిందుపురం సమీపంలో జరిగింది. ప్రసవ వేదన పడుతున్న నాగరత్నమ్మను బంధువులు వట్టికుంటపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో తీసుకెళుతుండగా హిందుపురానికి సమీపంలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. మార్గమధ్యంలోనే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బస్సులోనే ఉన్న ఎఎన్‌ఎం సుశీల, మరికొంత మహిళలు ప్రసవం చేశారు. అనంతరం తల్లీ బిడ్డలను హిందుపురం ఆసుపత్రిలో చేర్పించారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

కడప జిల్లాలోని దువ్యూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న క్వాలీస్‌ వాహనం కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలుకు చెందిన వీరు శబరిమలై నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 Woman gives birth to child in RTC bus

అగ్రి గోల్డ్‌లో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం పరిధిలోని గాజువాక బీసీ రోడ్డులో వున్న అగ్రిగోల్డ్‌ కార్యాలయంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నీచర్‌ చా లా వరకూ దగ్ధమయ్యాయి. కార్యాలయం నుంచి ఉదయం పొగలు రావడంతో చుట్టుపక్కలవారు పెదగంట్యాడ అగ్నిమాపక కార్యాలయానికి సమాచారాన్ని అందించారు. అతికష్టమ్మీద అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశా రు.

అప్పటికే కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. బ్రాంచ్‌ మేనేజర్‌ శాసి్త్రతోపాటు సిబ్బంది అక్కడకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నాలుగు లక్షల రూపాయల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక అధికారి దాలయ్యకు బీఎం శాసి్త్ర వివరించారు.

గాజువాక సీఐ ఎం.అప్పారావు నేతృ త్వంలో పోలీసులు దరాప్తు చేస్తున్నారు. షార్ట్‌ సర్కూృట్‌తో ప్రమాదం సంభవించి వుంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, తమకు డబ్బు చెల్లించడానికి తిప్పుతున్న సంస్థ సిబ్బందే ప్రమాదానికి కారకులై వుండవచ్చునని ఖాతాదారులు అగ్నిప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజున ప్రమాదం జరగడం వెనుక ఏదో మతలబు ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+