మహిళా టెక్కీ అదృశ్యం: అమ్మాయిని మోసం చేసి..

 A woman techie allegedly disappear
హైదరాబాద్: విధులకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన ఓ పాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యమైంది. నగరంలోని దమ్మాయిగూడకు చెందిన ప్రేమి(26) మాదాపూర్‌లోని ఓ ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిన ఆమె.. రాత్రయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త చైతన్య మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అమ్మాయిని మోసం చేసి..

ఓ అమ్మాయిని మోసగించి పెళ్లాడిన వ్యక్తిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా ముత్తయ్యపల్లికి చెందిన మేస్త్రి కృష్ణ ఎన్టీఆర్ గార్డెన్ వెనుక వైపున ఉన్న గుడిసెలో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడే ఉండే ఓ అమ్మాయి ఇతనికి పరిచయమైంది.

గతంలోనే వివాహమైన కృష్ణ, ఆ విషయాన్ని చెప్పకుండా అమ్మాయిని మోసగించి ఆగస్టు 2న తన ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. బాచుపల్లిలోని ఓ ఇంట్లో ఉంచి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి బంధువుల ఫిర్యాదుతో కృష్ణపై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+