రోజా! నీ సంగతి అంతా తెలుసు, కట్ చేస్తా: టిడిపి ఎమ్మెల్యే సంచలనం
గుంటూరు: "రోజా! నీ సంగతి అంతా నాకు తెలుసు, నిన్ను ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తా" అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు యరపతనేని శ్రీనివాస రావు హెచ్చరించారు. దయచేసి, మిగతా వాళ్లతో పెట్టుకున్నట్లు తనతో పెట్టుకోవద్దని ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు హితవు చెప్పారు.
తన గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని ఆయన అన్నారు. శుక్రవారం మాచవరం మండలంలో జరిగిన దళిత తేజం - తెలుగుదేసం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల పిన్నెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై, తనపై వైసిపి నాయకులు ఆధారం లేని ఆరోపణలు చేశారని ఆయన అన్నారు.

చంద్రబాబుపై, తనపై వైసిపి నాయకులు చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందో ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు. పల్నాడు ప్రాంతంలో గతంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే చూసి ఓర్వలేక వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications