నారా లోకేష్ దొరక్కుండా తిరుగుతున్నారు: వైసీపీ ఎటాక్.. టీడీపీ రివర్స్ ఎటాక్!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, లోకేష్, గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు మంత్రులు కూడా జైలుకు వెళతారని, అనేక స్కాం లలో వారు ఉన్నారని వైసిపి నేతలు, టిడిపి నేతలను టార్గెట్ చేస్తున్నారు.
ఇక నారా లోకేష్ ను త్వరలో అరెస్టు చేస్తారని ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఢిల్లీలో దొరక్కుండా రహస్యంగా తిరుగుతున్నారని, లోకేష్ ను టార్గెట్ చేస్తూ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో తనకు నోటీసులు ఇవ్వడానికి సీఐడీ పోలీసులు ఢిల్లీ వస్తున్నారని తెలిసి లోకేష్ మీడియాకు దొరక్కుండా రహస్యంగా తిరుగుతున్నారని పేర్కొంది.

కార్లు మారుస్తూ.. గెస్ట్ హౌసులు మారుస్తూ పోలీసులను ఏమార్చుతున్నారు అని వైసిపి లోకేష్ ను టార్గెట్ చేసింది. ఇన్నాళ్లూ ఐటిసి మౌర్య హోటల్లో విలాసంగా గడిపిన లోకేష్ ఇప్పుడు ముసుగు వేసుకుని ఎక్కడెక్కడో దాక్కుంటున్నారని ఎద్దేవా చేసింది. ప్రజలకు టోపీ పెట్టి వందలకోట్లు కొట్టేయడం ఎందుకు? ఇప్పుడు చట్టం కళ్లుగప్పేందుకు ముసుగులు వేసుకుని తిరగడం ఎందుకు నారా లోకేష్ అంటూ వైసీపీ లోకేష్ ను టార్గెట్ చేసింది.
వైసీపీ పెట్టిన పోస్ట్ కు తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో 2012 మే 27 ముందు, ఓ దొంగోడు వేసిన వేషాలన్నీ చెప్పేస్తున్నాడు, ఈ బుడ్డ సైకో అంటూ టార్గెట్ చేసిన టీడీపీ, మీ వాడిలా పగటి పూట కూడా ప్యాలెస్ లో , పిచ్చకి మందులు వేసుకుని, తన్నిపెట్టి పడుకుని, గుడ్లు పెడతాడు అనుకున్నావా ఏంటి? అంటూ సెటైర్లు వేసింది.
ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి లోకేష్ గారు, అశోకా రోడ్డు 50 లో ఉన్న ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కాళ్ళు జాపుకుని, మీ వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. రమ్మను, మంచి టీ ఇచ్చి పంపిస్తాం అంటూ వైసిపి చేసిన ఎటాక్ కు రివర్స్ ఎటాక్ చేసింది. ఇందులో సైకో జగన్ అంటూ హాష్ టాగ్ ను జత చేసింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications