పీకల్లోతు అప్పుల్లో వైసీపీ అభ్యర్థి; ఆస్తుల వేలానికి రంగం; జగన్ కు షాక్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకకు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఎమ్మిగనూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న బుట్టా రేణుక ఆస్తులపై ఇటీవల వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆమె పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నట్టుగా ఇప్పుడు అందరికీ అర్థం అవుతున్నాయి.

బుట్టా రేణుక విషయంలో జగన్ చెప్పింది నిజమే
వైయస్ జగన్ బుట్ట రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తెగ ట్రోల్ చేసింది కానీ నిజంగానే బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని తాజా పరిణామాలతో అర్థమవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే
బుట్టా రేణుక కు భారీ షాక్ ఇస్తూ ఆమె ఆస్తులను వేలం వేయడానికి హైదరాబాద్లోని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సిద్ధమైంది.

YCP MLA candidate butta renuka properties ready for e-auction shock to jagan at election time

బుట్టా రేణుక ఆస్తుల వేలం
బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మరికొన్ని సంస్థల ఆస్తులను మే ఆరవతేదీన ఈ వేలం వెయ్యనున్నట్టు హైదరాబాద్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. గత కొన్నేళ్ల క్రితం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి వ్యాపార అవసరాల నిమిత్తం బుట్టా రేణుక 340కోట్ల రుణాన్ని తీసుకున్నారు. అయితే ఆ రుణాన్ని సరిగా చెల్లించకపోవడంతో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది.

బుట్టా రేణుక వ్యాపారాలకు కరోనా దెబ్బ
కరోనా మహమ్మారి సమయంలో బుట్టా రేణుకకు సంబంధించిన పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఇక ఆ ప్రభావం బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు బుట్టా రేణుకకు సంబంధించిన ఇతర సంస్థల పైన కూడా పడింది. దీంతో బకాయిలు పేరుకుపోవడంతో తిరిగి చెల్లించని నేపథ్యంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుంది.

నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ లో బుట్టా రేణుక బకాయిల కేసు
అయితే ఇప్పటికే బకాయిల చెల్లింపు అంశంపై బుట్టా రేణుక నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకున్నారు. ఎన్సీఎల్టీలో కేసు ఉండగా వేలం ప్రకటన వేయడం నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక వాదిస్తున్నా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెళ్తుంది.

మే 6వ తేదీన బుట్టా రేణుక ఆస్తుల వేలం
బాకీ ఎగవేత అవకాశం ఉన్న సమయంలో ప్రత్యేక పరిస్థితుల్లో వేలం వేయడం ఆర్బిఐ ఆర్థిక సంస్థలకు కల్పించిన అధికారం దీంతో మే 6వ తేదీన బుట్టా రేణుక ఆస్తులను వేలం వేయనున్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న సమయంలో బుట్టా రేణుకకు మాత్రమే కాదు ఈ విషయం వైసిపికి కూడా షాక్ అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+