జలీల్‌ఖాన్...ఒకసారి అద్దంలో చూసుకో...ఎవరు సైతానో తెలుస్తుంది: అప్జల్ ఖాన్
కడప:జగన్ సైతాన్ అంటూ వ్యాఖ్యానించిన ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి టికే అప్జల్‌ఖాన్ మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను సైతాన్ అని సంబోధించడం దారుణమని...జలీల్‌ఖాన్ ఒకసారి అద్దంలో చూసుకుంటే ఎవరు సైతానో తెలుస్తుందని అప్జల్‌ఖాన్ అన్నారు
కడపలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో అప్జల్‌ఖాన్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫొటోతో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నమ్మక ద్రోహి అని టికే అప్జల్‌ఖాన్ విమర్శించారు. ఖాన్ అంటే మాట ఇచ్చి మాట తప్పని వ్యక్తి అని చెప్పారు. కానీ జలీల్ ఖాన్...వైఎస్ జగన్ ఫొటోతో గెలిచి తెలుగుదేశంలో చేరి జగన్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఖాన్ వంశంలో ఆయన చెడ పుట్టారని ముస్లింలకు పెద్ద మచ్చని అభివర్ణించారు.

పూటకో మాటతో ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని అప్జల్‌ఖాన్ విమర్శించారు. ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి నాలుగేళ్లు పూర్తయినా ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను అమరావతి పేరుతో సర్వనాశనం చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే అధికారం అని...జగన్ తప్పక సీఎం అవుతారని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications