యలహంక ఆస్తిపై షర్మిల రగడ చంద్రబాబు కోసమే: మాజీ మంత్రి పేర్ని నాని

స్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేదని, ఆయనకు ప్రజల మద్దతు కూడా లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.ఒకవైపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలు చేస్తూనే మరోవైపు జగన్‌గారిమీద విషప్రచారాలకోసం కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నామినేషన్లు వేయనీయకుండా ప్రతిపక్షాన్ని అడ్డుకున్నారని, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రతిపక్ష ఏజెంట్లు కూడా లేకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

పోలీసులు నుంచి ఏజెంట్లు క్లియరెన్స్‌ తీసుకోవడం ఎప్పుడైనా విన్నామా? అని ప్రశ్నించారు. ఈ కుట్రల నుంచి డైవర్షన్‌ కోసమే యలహంక ఆస్తిపాస్తులపై విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు షర్మిళ తెరపైకి వస్తున్నారని, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా షర్మిళ నడుచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే వైయస్‌.జగన్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

Yelahanka Property Propaganda is Just a Diversion Tactic Perni Nani Attacks Sharmila

రేపు మున్సిపల్‌ ఎన్నికలున్నాయనగా, బెంగళూరు ఆస్తి తనదే అంటూ ట్వీట్‌ దీంట్లో భాగమే అని పేర్ని నాని మండిపడ్డారు. యలహంక ఆస్తి జగన్‌గారి అత్తగారు డాక్టర్‌ సుగుణమ్మదని,
భారతి తల్లిదండ్రులు గంగిరెడ్డి, సుగుణమ్మ ఇద్దరూ డాక్టర్లు, వారికి కడప, అనంతపురం జిల్లాలో మంచి పేరుందని అన్నారు. ఆరోజుల్లోనే వారికి మంచి ప్రాక్టీస్ ఉందన్నారు. వారు చాలా స్థితిమంతులు అని పేర్కొన్నారు.

వారు బెంగళూరులో ప్రాపర్టీ కొన్నారన్నారు. దీనికి సంబంధించిన డాక్యెమెంట్లో చాలా స్పష్టంగా ఉంది. జగన్‌ కంపెనీ 20ఏళ్ల కిందటే యలహంక స్థలాన్ని లీజుకు తీసుకుంది. లీజుకున్న తీసుకున్న స్థలంలో రెండు గెస్ట్‌హౌస్‌లు కట్టారు. షర్మిల బెంగళూరు వచ్చేటప్పుడు ఒక దాంట్లో ఉండమన్నారు: ఆ స్థలంలో ఉన్న ప్రతి నిర్మాణానికీ ఇప్పటికీ బిల్లులు, ఛార్జీలు కడుతున్నది జగన్‌గారి కంపెనీయే అని పేర్ని నాని పేర్కొన్నారు.

ఇప్పుడు ఆ ఆస్తి తనదే అనడం భావ్యమా? అంటూ ప్రశ్నించారు. జగన్‌ షర్మిళకు రాశారని చెప్తున్న MOUలో కూడా యలహంక ప్రాపర్టీ ప్రస్తావన లేదు కదా? తాజ్‌మహల్‌ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వైయస్సార్‌గారు మరణం తర్వాతకూడా దాదాపు రూ.230 కోట్లను తన చెల్లెలు అయిన షర్మిళకు జగన్‌ ఇచ్చారు. ఈ రోజుల్లో పెళ్లై పాతికేళ్ల తర్వాత కూడా ఇలా డబ్బులు ఇచ్చే అన్న ఎక్కడైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు.

భద్రతా కారణాలరీత్యా యలహంకలో పెళ్లి వేడుక వద్దని ముందే చెప్పారన్నారు. తన కుమార్తెల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటానని చెప్పారు.
అలా చెప్పిన తర్వాతకూడా అక్కడే పెళ్లి అంటూ షర్మిల పెళ్లికార్డులు కొట్టించడం వెనుక అర్థం చంద్రబాబు కోసమే అన్నారు. కుమార్తె పెళ్లి వేదికగా వివాదాలు నడపడం సరైనదేనా? అంటూ నిలదీశారు.

హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌ ఇంటిని వాడుకోమని చెప్తే దాని ఊసే తేవటం లేదన్నారు.చంద్రబాబుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏదోలా రచ్చ చేయడం, షర్మిలకి అలవాటుగా మారిందన్నారు.తద్వారా జగన్‌ ని తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు.ముందుగా చంద్రబాబు తన గురించి తాను తెలుసుకోవాలన్నారు పేర్ని నాని. చంద్రబాబు మీ అమ్మానాన్నలకు ఎప్పుడైనా తిండిపెట్టావా..? చంద్రబాబూ చెల్లెళ్లు ఇద్దరూ ఎప్పుడైనా, ఎక్కడైనా నీ దగ్గర కనిపించారా..? అంటూ ప్రశ్నించారు.

లక్ష కోట్ల ఆస్తి తనకు ఉందని చంద్రబాబు తనకు తానే బహిరంగంగా చెప్పారు: మరి మీ తమ్ముడికి, మీ ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా చంద్రబాబు ఇచ్చారు? హైదరాబాద్‌ మాదాపూర్‌లోని దాదాపు 7 ఎకరాల భూమిని చంద్రబాబు తల్లి లోకేష్‌కు మాత్రమే ఎందుకు గిఫ్టుగా ఇచ్చింది? అమ్మణ్నమ్మకు ఇంకా కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కదా? వారికీ పిల్లలు ఉన్నారు కదా? ఎందుకు వారికి ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.

 శకునిలా, శిఖండిలా జగన్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ మంత్రి సవాల్
శకునిలా, శిఖండిలా జగన్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ మంత్రి సవాల్

చంద్రబాబు పరిపాలన పూర్తిగా ఫెయిల్‌ అయ్యింది కాబట్టే, ఈ కుట్రలు, ఈ విషప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఫెయిల్‌, మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయని విరుచుకుపడ్డారు.రాష్ట్రంలో ఏ వర్గంకూడా సంతోషంగా లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+