ప్రియురాలు మోసగించిందని...కిరోసిన్ పోసుకొని తగులబెట్టుకున్నాడు....

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

చిత్తూరు జిల్లా: ప్రేమించిన యువతి తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కుప్పం ఎస్‌ఐ లోకేశ్‌ కథనం ప్రకారం...పాకాల మండలం కుక్కలపల్లెకు 30 సంవత్సరాల చెందిన దామోదరం పుత్తూరులో ఓ కాలేజీలో పనిచేసేటపుడు ఒక యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పట్లో ఇద్దరూ కలిసి డీఎస్సీ కోచింగ్‌ కూడా తీసుకున్నారు. డీఎస్సీ 2016 లో ఆమె ఎస్జీటీగా ఎంపికయింది. అయితే దామోదరం కు ఉద్యోగం రాలేదు. యువతి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు రెండేళ్ల క్రితం ఆమెను తమ బంధువుల యువకుడికే ఇచ్చి పెళ్లి చేశారు.

కుప్పం మండలం మల్లానూరు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, పక్కనే గల కృష్ణాపురంలో భర్త తో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో దామోదరం కృష్ణాపురంలోని తాను గతంలో ప్రేమించిన ఆమె ఇంటివద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చిన కిరోసిన్‌ మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల బాధ తాళలేక కేకలు వేయడంతో స్థానికులు గమనించి మంటలు ఆర్పేలోగానే శరీరం 80 శాతం పైగా కాలిపోయింది.

సమాచారం అందుకున్న ఎస్‌ఐ లోకేశ్‌ 108అంబులెన్స్‌లో దామోదరాన్ని కుప్పం ఆసుపత్రికి చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో దామోదరం సోదరుడు నాగరాజు కుప్పం చేరుకుని అతన్ని తిరుపతి తీసుకువెళ్లారు. అక్కడ ఓ ఆసుపత్రిలో దామోదరం ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. శరీరం మొత్తం కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దామోదరం ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ లోకేశ్‌ తెలిపారు. అయితే తాను ప్రేమించిన మువతికి రెండేళ్ల క్రితమే వివాహమైతే ఇతడు ఇప్పుడు ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young man attempted suicide after being cheated by his lover at kuppam, chittoor district . According to Sub-Inspector lokesh, the victim has been identified as 30-year-old damodaram, cheated by a woman with the promise of marriage.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి