మహిళ మెయిల్ హ్యాక్: ఫ్రెండ్స్‌కి అసభ్య మెసేజ్ (ఫోటో)
హైదరాబాద్: ఓ మహిళ ఈమెయిల్ హ్యాక్ చేసి, నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను సృష్టించి అసభ్య సందేశాలు, ఫోటోలను ఇతరులకు పోస్టు చేసి వేధిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రయివేటు కంపెనీలో పని చేసి మానేసిన నవీన్ బాబు... మాదాపూర్‌లో నివసించే, అదే సంస్థలో పని చేస్తున్న ఒక మహిళకు సంబంధించిన ఈ మెయిల్‌ను హ్యాక్ చేశాడు.
దాని ద్వారా ఆమె స్నేహితులకు, బంధువులకు అసభ్య సందేశాలు పంపిస్తున్నాడు. ఆమె పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఫోటోలను పోస్టు చేస్తున్నాడు. పలు ఫోన్ నెంబరల్ ద్వారా ఆమెకు అసభ్య సందేశాలను పంపిస్తున్నాడు. డబ్బుల కోసం కూడా డిమాండ్ చేశాడు. వేర్వేరు సెల్ నెంబర్ల నుండి ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు.

బాధితురాలినే కాకుండా ఆమె స్నేహితులను కూడా వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు మే నెల 14న ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇస్తామని బాధితురాలితో పోలీసులు చెప్పించారు. బుధవారం మాదాపూర్‌లో ఆమె డబ్బులు అందజేస్తుండగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు విచారణలో తప్పును అంగీకరించాడు.
ఒకరి దారుణ హత్య
మేడిపల్లి పిఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని బండరాళ్లతో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చాపలో చుట్టి పడేశారు. బుధవారం సాయంత్రం ఓ ఫ్లాట్‌లో మృతదేహం బయటపడింది. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications