వైఎస్ ను దిగజార్చొద్దు..! జగన్ కు యూత్ కాంగ్రెస్ ఘాటు కౌంటర్..!

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి, ఆ తర్వాత విభేధించి బయటికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి సీఎం కూడా అయిన జగన్ (ys jagan)కు ఆ పార్టీ అంటే గిట్టదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన బీజేపీతో కలిసి నడుస్తున్న జగన్ .. తాజాగా ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సు సందర్భంగా యూత్ కాంగ్రెస్ (youth congress)చేపట్టిన నిరసనపై ట్వీట్ పెట్టి సంచలనం రేపారు. దీంతో యూత్ కాంగ్రెస్ కూడా దీటుగా జవాబిచ్చింది.

నిన్న జరిగిన ఏఐ సదస్సు (AI Impact Summitలో యువజన కాంగ్రెస్ మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు. మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి! ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు, మన రాజకీయ విభేదాలు ఏవైనా, మనం ఎల్లప్పుడూ ప్రపంచానికి ఐక్య ముఖాన్ని ప్రదర్శించాలంటూ జగన్ యూత్ కాంగ్రెస్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దీనికి కొన్ని గంటల్లోనే యూత్ కాంగ్రెస్ దీటుగా జవాబిచ్చింది.

Youth Congress Slams Jagan Don t Let YSR s Legacy Down Amid CBI ED Cases

ప్రియమైన జగన్.. మీ తండ్రిగారు, మన గర్వించదగ్గ నాయకుడు దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి (వై.ఎస్.ఆర్), మతతత్వ, విభజన & రాజీపడే శక్తులతో పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేశారని యూత్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అలాగే మీరు సిబిఐ/ఇడి కేసులను ఎదుర్కొంటున్నారని మాకు అర్థమైంది, కానీ కనీసం, మీ తండ్రి వారసత్వాన్ని అంత బహిరంగంగా దిగజార్చకండి అంటూ జగన్ కు చురకలు అంటించింది. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే జగన్ పై రాష్ట్రంలో షర్మిల విమర్శలు గుప్పిస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+