Youtube Academy: ఏపీలో యూట్యూబ్ అకాడమీ..! గ్లోబల్ సీఈవోతో చంద్రబాబు చర్చలు..!
ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మక సంస్థలకు ఆహ్వానాలు పలుకుతోంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు గూగుల్ కు చెందిన వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ తన అకాడమీ పెట్టేందుకు ప్రతిపాదనలు ఆహ్వానించారు. ఇవాళ యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో ఆన్ లైన్ ద్వారా చంద్రబాబు ఈ మేరకు చర్చలు జరిపారు. వీటిలో సానుకూల స్పందన వ్యక్తమైనట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.
అమరావతి రాజధానిలో మీడియా సిటీ కూడా నిర్మించేందుకు గతంలోనే టీడీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదనలు ఇచ్చింది. ఇందులోనే ఇప్పుడు యూట్యూబ్ అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఇవాళ సీఎం చంద్రబాబు.. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్ తో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తా కూడా పాల్గొన్నారు. ఈ ముగ్గురు జరిపిన చర్చల్లో అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు యూట్యూబ్ కు ఈ చర్చల్లో ఆహ్వానం పలికారు. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని వారిని చంద్రబాబు ఆహ్వానించారు. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడెమీలో పరిశోధనలు చేయనున్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తదుపరి దశ చర్చల్లో క్లారిటీ రానుంది.













Click it and Unblock the Notifications