వివేకా కేసులో కీలక పరిణామం - సీబీఐ ఎలా నిర్ణయిస్తుంది..!!

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు లో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు లో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. హత్య కేసు లో ఏ-4 దస్తగిరినీ అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈ పిటీషన్ ను భాస్కర రెడ్డి కోర్టులో వేసారు. ఇప్పటికే భాస్కర రెడ్డిని విచారణకు రమ్మంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. గత వారం నోటీసుల మేరకు కడప లో భాస్కర రెడ్డి హాజరు కాగా..సీబీఐ అధికారులు అందుబాటులో లేరు. దీంతో..మరోసారి నోటీసులు ఇస్తామని సీబీఐ చెప్పింది. ఇప్పుడు ఈ విచారణ సమయంలో భాస్కర రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ లో కీలక అంశాలను ప్రస్తావించారు.

YS Bhaskar Reddy files petition in TS High Court, allegates CBI helps Dastagiri in Viveka Case

వివేకా హత్య కేసులో దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లను సీబీఐ విచారించింది. దస్తగిరినీ అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు భాస్కర రెడ్డి పిటీషన్ దాఖలు చేసారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా తమను నేరంలోకి నెట్టం సరికాదని భాస్కర రెడ్డి పిటీషన్ లో పేర్కొన్నారు.సిబిఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడని ఆరోపించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు. కీలక పాత్ర పోషించిన దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదన్నారు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే అని భాస్కర రెడ్డి తన పిటీషన్ లో వివరించారు. దస్తగిరి బెయిల్ సమయంలోను సిబిఐసహకరించిందని చెప్పుకొచ్చారు. దస్తగిరి పై ఉన్న ఆధారాలను కింది కోర్ట్ పట్టించుకోలేదన్నారు.

YS Bhaskar Reddy files petition in TS High Court, allegates CBI helps Dastagiri in Viveka Case

దస్తగిరి కి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. అటు అవినాశ్ రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. విచారణ అధికారులు కోరిన సమాచారం ఇచ్చారు. తన విచారణ రికార్డ్ చేయాలంటూ అవినాశ్ దాఖలు చేసిన పిటీషన్ పైన హైకోర్టు స్పష్టత ఇచ్చింది. అరెస్ట్ చేయొద్దన్న అవినాష్ రెడ్డి వాదనలను తోసిపుచ్చింది. సీబీఐకి అనుకూలంగా తీర్పు వెల్లడించింది కోర్టు. అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పలేదని.. గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. పిటీషన్ పై తీర్పు తర్వాత.. కోర్టుకు ఇచ్చిన ఆధారాలను సీబీఐకి తిరిగి ఇచ్చేసింది. ఇప్పుడు భాస్కరరెడ్డి పిటీషన్ పైన సీబీఐ దాఖలు చేసే సమాధానం ఏంటనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+