రాపాక కుమారుడి పెళ్లికి జగన్-నవదంపతులకు శుభాకాంక్షలు..
ఏపీలో జనసేన తరఫున గెలిచి అనంతరం వైసీపీకి సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనధికార వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న రాపాక వరప్రసాద్ ఇవాళ కుమారుడికి పెళ్లి చేశారు. ఈ పెళ్లికి సీఎం జగన్ హాజరయ్యారు.
డా.బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కత్తిమండలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. పలువురు వైసీపీ నేతలతో కలిసి ఆయన ఈ పెళ్లికి వెళ్లారు. దీంతో జగన్ కు రాపాక ఎదురేగి ఆహ్వానం పలికారు. అనంతరం పెళ్లి మండపానికి చేరుకున్న జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కత్తిమండ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకలో నూతన వధూవరులు శ్రీతన్మయి, వెంకట్‌రామ్‌లకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాదరావు.. అనంతరం పవన్ కళ్యాణ్ తో విభేదించి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో అప్పట్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు ఆ పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సైతం వీరిద్దరూ పోటీ పడబోతున్నారు. అలాగే వైసీపీ టికెట్ తనదేనంటూ ఇప్పటికే రాపాక ప్రకటించుకున్నారు. వైసీపీ కూడా మరోసారి ఇక్కడ రాపాకకే టికెట్ ఇస్తే గెలుస్తారని అంచనాలో ఉంది.












Click it and Unblock the Notifications