ఎమ్మెల్సీ ఫలితాలు:ఎన్నికలకు చంద్రబాబు సిద్దమా, రె'ఢీ' అన్న జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:చంద్రబాబునాయుడుకు దమ్ము, ధైర్యముంటే ఎన్నికలకు రావాలని ప్రతిపక్షనాయకుడు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పోలీసులను ఉపయోగించి అడ్డగోలుగా డబ్బులు గుమ్మరించి పరోక్ష ఎన్నికల్లో నాలుగు ఓట్లతో మూడు సీట్లు గెలిచినంతమాత్రాన గొప్ప విజయం కాదన్నారు జగన్.చంద్రబాబుకు మరోసారి విసురుతున్నా...దమ్ము ధైర్యముంటే ఎన్నికలకు సిద్దపడాలని ఆయన సవాల్ విసిరారు.

ys jagan challenged to chandrababu ready for elections

బుదవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలతో ధైర్యం ఉంటే రాజీనామా చేయించి లేదా వారిపై అనర్హత వేటు వేయించి ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

పరోక్ష ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచినంత మాత్రాన గొప్ప విజయంగా చెప్పుకోవడం సరికాదన్నారాయన.ప్రత్యక్ష ఎన్నికల్లో చావుదెబ్బ తింటే ఒక్కమాట కూడ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

ప్రజలతో ప్రత్యక్షంగా జరిగే ఎన్నికల్లో నిలబడే దైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.ఐదు చోట్ల ఎన్నికలు జరిగితే నాలుగు చోట్ల టిడిపికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. చదువుకొన్నవారు ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా ఓటు వేశారని జగన్ చెప్పారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన మరోసారి సవాల్ విసిరారు.

ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను రెఫరెండంగా భావిస్తామని జగన్ అభిప్రాయపడ్డారు.తమ పార్టీ గెలిచిన స్థానాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో ఎన్నికలకు వెళ్తామని ఆయన కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ys jagan challenged to chandrababu ready for elections on wednesday. after assembly adjourned jagan spoke with media.
Please Wait while comments are loading...