వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదాపై పోరులో వెనక్కి: చిక్కుల్లో జగన్, అసలేం జరిగింది?

ప్రత్యేక హోదాపై ఎంపిలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఆ విషయాన్ని దాటవేస్తూ వస్తున్నారు. అసలేం జరిగింది.

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: మడమ తిప్పను, మాట తప్పను అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పలుమార్లు అన్నారు. చంద్రబాబులాగా పొద్దునో మాట, రాత్రికో మాట చెప్పనని కూడా అన్నారు.

ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ఓటుకు నోటు కేసు వల్ల కేంద్రంతో రాజీ పడ్డారని ఆయన విమర్సిస్తూ వచ్చారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపిని ఎందుకు తప్పించడం లేదని, తన పార్లమెంటు సభ్యులతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ఆయన చంద్రబాబును ప్రశ్నిస్తూ వచ్చారు.

చంద్రబాబు రాజీ పడ్డారు కాబట్టే తాము ప్రత్యేక హోదా కోసం ప్రజల తరఫున పోరాటం చేస్తున్నామని కూడా జగన్ చెప్పారు. ఏప్రిల్ పార్లమెంటు సెషన్ వరకు వేచి చూసి, అప్పటికి కూడా కేంద్రం ప్రత్యేక హోదాపై స్పందించకపోతే తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలను ఆహ్వానిస్తామని జగన్ చెప్పారు.

రాజీనామా పెద్ద విషయం కాదంటూనే...

రాజీనామా పెద్ద విషయం కాదంటూనే...

ప్రత్యేక హోదా కోసం తామే పోరాటం చేస్తున్నామని, అయితే రాజీనామా పెద్ద విషయం విషయం కాదని, కానీ తాము రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండదు కదా, అయినా చూస్తామని జగన్ అన్నారు. దీన్నిబట్టి తన పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయించే విషయంలో వెనక్కి తగ్గినట్లు అర్థమవుతోంది. ఆయనకు ఎంపిలతో రాజీనామా చేయించే ఉద్దేశం లేదని స్పష్టంగానే తెలిసిపోతోంది.

అంతకు ముందు ఇలా...

అంతకు ముందు ఇలా...

గత ఏప్రిల్ నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మాట తప్పనని గతంలో ప్రకటించిన జగన్ జూన్‌లో తన పార్టీ ఎంపీలందరితో రాజీనామాలు చేయించేందుకు సిద్ధమవుతారని భావించారు. కానీ జగన్ ఆ ఊసే ఎత్తలేదు.

మడమ తప్పినట్లే..

మడమ తప్పినట్లే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సమయంలో చేసిన ప్రకటనను చూస్తే ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు అర్థమవుతోంది. అందరూ రాజీనామా చేస్తే పార్లమెంటులో హోదాపై ఎవరు పోరాడతారని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. జగన్ రాజీనామాలపై ఏకపక్షంగా అంటే, పార్టీ పార్లమెంటు సభ్యులతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నప్పుడే, చాలామంది తప్పు పట్టారు. కానీ బయటపడడానికి ఇష్టపడలేదు.

దూకుడు తగ్గించారు...

దూకుడు తగ్గించారు...

జగన్ ప్రకటనతో అసంతృప్తి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని కాస్తా అయిష్టంగానే చెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజులకే స్వరంలో దూకుడు తగ్గించారు. తమ రాజీనామాల వల్ల హోదా వస్తుందంటే రాజీనామాలకు సిద్ధమేనని చెబుతూ వచ్చారు. దీంతో వైసిపి పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరని అర్థమైంది.

లాభం కన్నా నష్టమే ఎక్కువ...

లాభం కన్నా నష్టమే ఎక్కువ...

మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అర్ధంతరంగా రాజీనామా చేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని వైసిపి పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో తాము రాజీనామా చేయలేమని ఎంపీలు చెప్పడం వల్లే జగన్ మాట మార్చాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సూటిగా చెప్పకుండా...

సూటిగా చెప్పకుండా...


ప్రత్యేక హోదా విషయంలో ఎంపిల చేత రాజీనామాలు చేయించే విషయంపై ఇటీవలి కాలంలో మీడియా అడిగిన ప్రశ్నలకు జగన్ సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేత వైఖరి ప్రదర్శిస్తున్నారు. మీ ఎంపిలు జూన్‌లో రాజీనామాలు చేస్తారా? అని అడిగిన ప్రతి సందర్భంలోనూ ‘ఇప్పటికి చాలాసార్లు చెప్పా కదా అన్నా' అంటూ దాటవేస్తున్నారు. పార్లమెంటులో హోదాపై పోరాడాలి కాబట్టి, తాము రాజీనామా చేస్తే అలాంటి అవకాశం ఉండదనే వాదనతో రాజీనామాల అంశాన్ని పక్కన పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.

మరో సమస్య కూడా....

మరో సమస్య కూడా....

ఎంపిలు సుముఖంగా లేకపోవడం వల్ల జగన్ రాజీనామాలు చేయించే విషయంపై వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. దాన్ని ఆసరా చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసుల నుంచి బయటపడడానికి జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో రాజీపడ్డారని వారు ఆరోపిస్తున్నారు. మోడీతో జగన్ భేటీ జరిగిన తర్వాత ఈ ఆరోపణ ఊపందుకుంది. దీంతో జగన్ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. హోదాపై ఆయన రాజీ మార్గం పట్టారనే అభిప్రాయానికి బలం చేకూరుతూ వస్తోంది.

English summary
It is said that YSR Congress party president YS Jagan has compromised on the demond of special category status to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X