YS Jagan: ఈసారి అసెంబ్లీకి హాజరుపై తేల్చేసిన జగన్ ! సేమ్ సీన్ రిపీట్ ?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో కూటమి 164 సీట్లు సాధిస్తే విపక్ష వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తొలి అసెంబ్లీ సమావేశానికి వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయక తప్పదు కాబట్టి ఆ సమావేశానికి హజరైన జగన్... ప్రమాణం పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు రెండో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

ys jagan declare to attend assembly session this time but

రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, చిన్నారులపై అత్యాచారాలపై విపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను కత్తితో నరికి చంపేశారు. దీంతో ఇవాళ వినుకొండ వెళ్లి మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్...అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై స్పష్టత ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానున్నట్లు జగన్ వెల్లడించారు.

ys jagan declare to attend assembly session this time but

జూలై 22న సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయసభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఆ తర్వాత రోజు ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి నిరసన చేపడతామని జగన్ తెలిపారు. అయితే గతంలో తొలి సెషన్ సందర్భంగా కూడా జగన్ మొదటి రోజు హాజరై ఆ తర్వాత తిరిగి అసెంబ్లీకి వెళ్లలేదు. ఈసారి కూడా తొలి రోజు మాత్రమే జగన్ హాజరై అదీ గవర్నర్ ప్రసంగం అడ్డుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+