దేశమంతా తిరగనివ్వండి, బాధ్యత ఉంది: కోర్టుకు జగన్

తనపై నేరం ఇంకా రుజువు కానందున నియోజకవర్గానికి, పార్టీకి సేవలు అందించే హక్కులను కాలరాయరాదని కోరారు. ఇందుకు సంబంధంచి జగన్ రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వస్తుంది.
పర్యటనకు రెండు రోజుల ముందు సమాచారాన్ని అందచేయాలన్న షరతును సడలించాలని కోరుతూ జగన్ రెండో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా కోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది.
మరోవైపు ఈ నెల 8వ తేది నుండి 11 వరకు కడపకు వెళ్తున్నట్లుగా జగన్ కోర్టుకు సమాచారం అందించారు. ఆస్తుల కేసులో ఉన్న విజయ సాయి రెడ్డి అదే రోజు బెంగళూరు వెళ్లనున్నట్లు మెమో దాఖలు చేశారు.
కోర్టుకు తన పర్యటన విషయమై తెలిపిన జగన్ ఈ రోజు రాత్రి రైలులో హైదరాబాదు నుంచి కడపకు వెళ్లనున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications