దువ్వాడ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వైఎస్ జగన్!

దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. దువ్వాడ కుటుంబ వ్యవహారం ఎంతకీ తెగకపోవడంతో తాజాగా వైసిపి దువ్వాడకు ఊహించని షాక్ ఇచ్చింది. టెక్కలి వైసిపి ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలకు ఉపక్రమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దువ్వాడకు జగన్ షాక్
టెక్కలి వైసిపి ఇన్చార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తప్పిస్తూ వైసిపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్ ను టెక్కలి వైసిపి ఇన్చార్జిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు, దువ్వాడ వారి ఫ్యామిలీ పంచాయతీ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.

YS Jagan gave a big shock to Duvvada Srinivas duvvada removed from tekkali incharge

15 రోజులుగా దువ్వాడ ఇంటి ముందే భార్య వాణి
గత 15 రోజులుగా దువ్వాడ శ్రీను సతీమణి వాణి టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటి ముందు కూర్చుని తమను ఇంట్లోకి రానివ్వాలని ఆందోళన చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్యను, కూతుళ్లను ఇంట్లోకి రానిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. కోర్టుకు కూడా వెళ్ళారు.

దువ్వాడ వారి స్టోరీలో మాధురి పాత్ర ఇలా
ఇదిలా ఉంటే వివాహేతరసంబంధం పెట్టుకొని తమని నిర్లక్ష్యం చేస్తున్నారని వాణి చేసిన ఆరోపణలతో బయటకు వచ్చిన వైసీపీ కార్యకర్త దివ్వల మాధురి తాను దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటిపైన తనకే హక్కు ఉందని తాను రెండుకోట్లు ఆ ఇంటి నిర్మాణానికి ఇచ్చానని తన డబ్బులు తనకిచ్చి వాణి ఆ ఇంట్లోకి వెళ్లడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మాధురి చెప్పారు.

టెక్కలి ఇంచార్జ్ బాధ్యతల నుండి తొలగింపు
ఇక దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని రాత్రికి రాత్రే ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీసుగా మార్చేశారు. ఇక దువ్వాడ వాణి ఇప్పటికే తన భర్త విషయంలో జగన్ చొరవ చూపించాలని తమ కుటుంబ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక తాజా పరిణామంలో భాగంగా టెక్కలి ఇన్చార్జి బాధ్యతల నుండి దువ్వాడ శ్రీనివాస్ ను తొలగించారు వైఎస్ జగన్.

కుటుంబ కలహాలతో శ్రీనివాస్ పై వేటు
కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. మరి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జగన్ తీసుకున్న స్టెప్ తో ఆయన ఏం చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. వైసీపీ రాజకీయ వర్గాలలో ఇప్పుడు టెక్కలి వ్యవహారం ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+