అంగన్ వాడీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్- ఈ డిమాండ్లపై ఉత్తర్వులు జారీ..
ఏపీలో కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీ హెల్పర్లు,వర్కర్లకు వైసీపీ సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అంగీకరించిన రెండు కీలక డిమాండ్లకు సంబంధించి ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అంగన్ వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు వయో పరిమితి పెంపుతో పాటు మరో ఉత్తర్వు కూడా ఉంది. తాజాగా మంత్రుల కమిటీతో జరిపిన చర్చల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో అంగన్ వాడీ హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై అంగన్ వాడీ హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. అలాగే అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లకు టీఏ, డీఏ లు చెల్లించేందుకు ఉద్దేశించిన మరో ఉత్తర్వు కూడా జారీ చేసిది.

ఇటీవల మంత్రుల చర్చల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రెండు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు డిమాండ్ ల సాధన కోసం అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు. ఇవి తీవ్రతరం అవుతున్న క్రమంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన డిమాండ్లపైనా ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలకు వేసిన తాళాలు పగులగొడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కార్ తాజా ఉత్తర్వులు ఊరటగా చెప్పుకోవచ్చు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications