అందుకే ఆపేశా: ఏడు నెలల ఆలస్యంపై జగన్ వివరణ, కానీ వీటి మాటేమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరేడు నెలలుగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై యువభేరీలో జగన్ స్పందించారు.

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన జగన్, రాజీనామా, పాదయాత్రలపై..

 అప్పుడు యువభేరీ, ఇప్పుడు

అప్పుడు యువభేరీ, ఇప్పుడు

అనంతపురం కంటే ముందు గుంటూరులో యువభేరీని నిర్వహించారు. అప్పటి నుంచి ఏడెనిమిది నెలల పాటు ప్రత్యేక హోదాపై నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టారు. గుంటూరు యువభేరీ అనంతరం కొద్ది రోజులకు జగన్ ప్రధాని మోడీని కలిశారు.

 ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని

ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని

అప్పటి నుంచి బిజెపి - వైసిపి పొత్తులపై చర్చ సాగుతోంది. బిజెపితో పొత్తు కోసమే జగన్ యువభేరీని, ప్రత్యేక హోదాను పక్కన పెట్టారనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్.. మళ్లీ అనంతపురం యువభేరీ వరకు మాట్లాడలేదు. తాజాగా చివరి అస్త్రంగా రాజీనామాలు చేయిస్తానని చెప్పారు.

జగన్ వివరణ

జగన్ వివరణ

కానీ ఇన్నాళ్ల పాటు తాను యువభేరీని ఎందుకు నిర్వహించలేదో చెప్పే ప్రయత్నం జగన్ అనంత సభలో చేశారు. ఇన్నాళ్లు ఆగటంపై జగన్ వివరణ ఇచ్చారు. గుంటూరులో 9వ యువభేరీ జరిగిందని, ఆ తర్వాత విద్యార్థులకు పరీక్షలు, సెలవులు, అనంతరం అడ్మిషన్స్ వచ్చాయని, ఇప్పుడు మళ్లీ యువభేరీ ప్రారంభించామని చెప్పారు.

ఆలస్యంపై ఓకే, కానీ వీటి మాటేమిటి?

ఆలస్యంపై ఓకే, కానీ వీటి మాటేమిటి?

తద్వారా బిజెపితో దగ్గరయ్యేందుకే ఇన్నాళ్ల పాటు యువభేరీ నిర్వహించలేదన్న ఆరోపణలకు జగన్ పైవిధంగా సమాధానం చెప్పారు. యువభేరీని ఎందుకు నిర్వహించలేదో చెప్పిన జగన్.. ప్రత్యేక హోదా గురించి ఇన్నాళ్లు గట్టిగా ఎందుకు మాట్లాడలేదు, ఎంపీలతో రాజీనామాలపై ఎందుకు ఆలస్యం చేశారనే విషయం మాత్రం చెప్పలేదని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy highlighted need for special status to Andhra Pradesh at Anantapur Yuva Bheri programme on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి