వ్యూహం సినిమా నిర్మాత జగనే; దమ్ముంటే.. ఆర్జీవీకి నారా లోకేష్ సవాల్!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బేస్ చేసుకుని ఆర్జీవి నిర్మించిన చిత్రం వ్యూహం. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకొని నిర్మించిన వ్యూహం చిత్రం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. వ్యూహం సినిమాపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.

తెలంగాణా హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద ఈ సినిమా కు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అలాంటిది ఏమీ లేదని వర్మ కొట్టి పారేశారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ వేసిన పిటీషన్ తో వర్మ సినిమాకు బ్రేక్ పడింది.

 YS Jagan is the producer of RGV vyooham: nara lokesh slams and challenged RGV

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల కథా నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పాత్రలను ప్రధానంగా తీసుకొని, ముఖ్యంగా చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా రాంగోపాల్ వర్మ చిత్రం నిర్మించారు. మొదటి నుంచి చంద్రబాబును టార్గెట్ చేస్తున్న రాంగోపాల్ వర్మ, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇమేజ్ మరింత దెబ్బతినేలా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

ఇక దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆర్జీవీకి వ్యూహం సినిమా విషయంలో నారా లోకేష్ ఒక సవాల్ విసిరారు. వ్యూహం చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదు అంటే ఎలా అంటూ ప్రశ్నించిన నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమాలు తీయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటూ మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలపై బురద జల్లడం కోసం ఇలాంటి సినిమాలు తీయడం కొందరికి అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ జగనే అని, ఈ సినిమా తీసే క్రమంలో డైరెక్టర్ రెండు మూడుసార్లు జగన్ ను కలిశారని నారా లోకేష్ ఆరోపించారు.

రాంగోపాల్ వర్మ తరపున న్యాయపోరాటం చేస్తున్న లాయర్ వైసిపి రాజ్యసభ సభ్యుడని, తెలంగాణ హైకోర్టులో వర్మ కోసం వాదిస్తున్నాడు అంటే అర్థం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. రాంగోపాల్ వర్మ నిజంగా సినిమా తీయాలంటే, వర్మకు సినిమాలు తీసే దమ్ముంటే కోడి కత్తి, ప్యాలెస్ లో జరుగుతున్న అవినీతి, హూ కిల్డ్ బాబాయ్ మీద సినిమాలు తీయాలని నారా లోకేష్ సవాల్ విసిరారు.

దీని వెనక ప్రభుత్వం ఉందని లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయటం కోసం ఇలాంటి సినిమాలను విడుదల చేస్తే సహించేది లేదని నారా లోకేష్ తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+