తోడేళ్ల మధ్య జగన్ ఒంటరే-కానీ జన హృదయాల్లో ఉన్నా-ఏలూరు సభలో గర్జన..
ఏలూరులో ఇవాళ నిర్వహించిన వైసీపీ సిద్ధం 2 సభలో సీఎం జగన్ మీరు సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించారు. మరో చారిత్రక విజయం అందుకునేందుకు సిద్ధమా.. ఇంటింటి భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా... పేదల భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా..దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా.. అని వైసీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. రామాయణం, భారతంలో విలన్లంతా ఎల్లో మీడియా, విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారంటూ జగన్ గుర్తుచేశారు. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడన్నారు.
విపక్షాల సైన్యం పొత్తులు, ఎల్లో మీడియా అయితే తన సైన్యం దేవుడు, ప్రజలే అని జగన్ తెలిపారు. ఇక్కడ కనిపిస్తున్న జనమే తన నమ్మకం, బలం అన్నారు. వచ్చే పోరులో మీరు కృష్ణుడైతే.. నేను అర్జునుడిని అన్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమం, మంచిపై విపక్షాలు దాడి చేస్తున్నాయని, పేదవాడి సంక్షేమం మీద, రాబోయే తరం విద్యావిధానాలపై దాడి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో మార్పు కనిపిస్తోందని, తమ సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యమన్నారు. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు గెల్చుకోవడమే తమ లక్ష్యమన్నారు. తన మాటల్ని ప్రతీ కుటుంబానికీ చేరవేయాలని కోరారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారో అడగాలని జగన్ సూచించారు. చంద్రబాబు, జగన్ పాలనకు మధ్య తేడాను గమనించాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన పథకాలు ఏంటో అడగాలన్నారు. చంద్రబాబు హయాంలో అక్క చెల్లెళ్ల ఖాతాల్లో రూపాయి అయినా పడిందా అని అడిగారు. చంద్రబాబు 10 శాతం హామీలైనా నెరవేర్చాడా అని అడిగారు. చంద్రబాబు పాలనకూ, జగన్ 57 నెలల పాలనకూ తేడా గమనించాలన్నారు.

-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications