"అన్ని ఆధారాలున్నాయ్.. అక్కడే తేల్చుకుంటాం..!"- జగన్ వార్నింగ్ ..!

ఏపీలో నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతుంటే ఎస్ఈసీ కళ్లుమూసుకుని ఉండిపోయిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తొత్తుగా వ్యవహరించిన ఎస్ఈసీ.. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోగొట్టారని మండిపడ్డారు. భారీ ఎత్తున అక్రమాలు జరిగితే కేవలం నాలుగు బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై తదుపరి కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు.

12 గంటల్లోనే స్థానిక ఎన్నికల ఫలితాలు- పోలింగ్, కౌంటింగ్ పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!
12 గంటల్లోనే స్థానిక ఎన్నికల ఫలితాలు- పోలింగ్, కౌంటింగ్ పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకు తొత్తుగా మారిపోయిందని జగన్ ట్వీట్ లో ఆరోపించారు. ఎన్నికల అక్రమాలకు ఎస్ఈసీ ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. నిన్న పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారని, ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, తమ పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల తమ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాగేశారని్నారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయన్నారు.

YS Jagan Launches Attack on AP SEC Over Poll Irregularities Warns of Legal Battle

ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌, సైక్లింగ్‌ చేశారని, ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయని జగన్ తెలిపారు. ఆ 70 బూత్‌ల్లో తమ పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా తన సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారన్నారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసిందన్నారు. అయినా ఎస్ఈసీ స్పందించిన తీరు అత్యంత దారుణమన్నారు. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. ఎస్ఈసీది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? అని నిలదీశారు.

YS Jagan Launches Attack on AP SEC Over Poll Irregularities Warns of Legal Battle
పులివెందులలో జగన్ మెరుపు ధర్నా- ఆర్వో ఆఫీసు బయట ఏజెంట్లతో..!
పులివెందులలో జగన్ మెరుపు ధర్నా- ఆర్వో ఆఫీసు బయట ఏజెంట్లతో..!

వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? అని జగన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని అడిగారు. పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయన్నారు. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్‌, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+