పాదయాత్రతో లోకేష్- వారాహితో పవన్ కళ్యాణ్- జగన్ కౌంటర్ ప్లాన్ రెడీ అవుతోందా ?
ఏపీలో ఈ ఏడాది రాజకీయంగా చాలా కీలకం కాబోతోంది. ముఖ్యంగా ఎన్నికల ఏడాదిగా భావిస్తున్న ఈ ఏడాదిలో వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు చేసే పోరాటాలే 2024 ఎన్నికల ఫలితాల్ని నిర్దేశించబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కొత్త వ్యూహాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న యువతను ఆకట్టుకునేలా ఓవైపు లోకేష్, మరోవైపు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. వీరిని తట్టుకుని తనకే ఆదరణ ఉందని నిరూపించుకోవడం జగన్ కు సవాల్ గా మారింది.

ఏపీలో యాత్రల జోరు
ఏపీలో కొత్త ఏడాది యాత్రలతో రాజకీయాన్ని మొదలుపెట్టేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో ముందుగా నారా లోకేష్ యువగళం యాత్ర ఈ నెల 27న కుప్పంలో ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అదను చూసి వారాహితో యాత్ర మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరి టార్గెట్ యువతే. దీంతో వీరిద్దరికీ పోటీగా జగన్ ఏం చేయబోతున్నారనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఇప్పటివరకూ గడప గడపకూ ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో జగన్ ఎక్కడా నేరుగా పాల్గొనడం లేదు. కానీ ఎన్నికల ఏడాదిలోనూ జగన్ క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యే పరిస్ధితి లేదు. దీంతో జగన్ తాజా వ్యూహాలపై రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది.

లోకేష్ పాదయాత్ర
ఈ నెల 27న కుప్పం నుంచి టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ గతంలోలా పటిష్టంగా కనిపించడం లేదు. ఇప్పటికే స్ధానిక ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టిన వైసీపీ.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని సవాళ్లు విసురుతోంది. దీంతో చంద్రబాబు కూడా ఎన్నడూ లేని స్దాయిలో కుప్పంలో తిరగాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోకుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర చేపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పాదయాత్ర కూడా అన్ని వర్గాలను కాకుండా యువతను టార్గెట్ చేస్తుండటంతో గత ఎన్నికల్లో భారీగా ఓట్లు వేసిన యువతపై ఇది ఏమేరకు ప్రభావం చూపబోతోందనే చర్చ జరుగుతోంది.

పవన్ వారాహి యాత్ర
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వారాహి పేరుతో ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్నారు. అయితే ఏపీలో యాత్ర ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనేది ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ ఆ లోపే తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో అక్కడ వారాహితో యాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది. అనంతరం ఏపీలోనూ పవన్ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు లోకేష్ పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో మరోవైపు పవన్ వారాహి యాత్ర రూట్ మ్యాప్ కీలకం కానుంది. ఇప్పటికే టీడీపీతో అంతర్గతంగా అవగాహనతో సాగుతున్న పవన్ .. వారాహి యాత్రను లోకేష్ పాదయాత్రకు క్లాష్ కాకుండా ప్లాన్ చేసుకోవడం ఖాయం. పవన్ యాత్ర కూడా అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నా ముఖ్యంగా యూత్ టార్గెట్ గానే ఉండబోతోంది. దీంతో లోకేష్, పవన్ రాష్ట్రంలో యూత్ ను ఈసారి టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దీటైన ప్లాన్ కోసం జగన్ కసరత్తు ?
రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర, పవన్ వారాహి యాత్రలు ఈ ఏడాదిలో ఉంటాయి. వాటికి పోటీగా వైసీపీ వైపు నుంచి జగన్ మరో యాత్ర లేదా, జనంలోకి నిత్యం తిరిగే ఏదో ఒక కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పాటు యూత్ టార్గెట్ గా లోకేష్, పవన్ జనంలోకి వెళితే వారికి కౌంటర్ గా అదే స్ధాయిలో జగన్ కూడా జనంలో తిరగాల్సిన పరిస్ధితులు ఉంటాయి. విపక్షంలో ఉన్నప్పుడు యువభేరిలు నిర్వహించిన జగన్.. ఇప్పుడు అదే స్ధాయిలో యువతను ఆకట్టుకునే కార్యక్రమాలు ప్లాన్ చేయాల్సి ఉంది. అలాగే ప్రభుత్వంపై విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని జగన్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉన్నా .. ఎన్నికల ఏడాదిలో ఈ దాడిని తట్టుకోవాలంటే జగన్ నిత్యం జనంలోనే ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో జగన్ అందుకు తగినట్లుగానే రచ్చబండ లేదా జనంలో ఉండే మరో కార్యక్రమం చేపట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ కార్యక్రమం నుంచే వీరిద్దరికీ కౌంటర్లు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications