రాక్షస పాలన, అంతా అవినీతే చంద్రబాబుపై జగన్ నిప్పులు

Subscribe to Oneindia Telugu

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందంటూ మండిపడ్డారు.

ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా 27వ రోజు మంగళవారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్ద వడుగూరు బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబునాయుడు నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. బాబు వచ్చినా.. ఉద్యోగాలు రాలేదంటూ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మాల్స్ పెట్టేది అందుకే

మాల్స్ పెట్టేది అందుకే

‘బాబు రాకముందు వరకు రేషన్‌ షాపుల్లో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. వేలి ముద్రలు పడటం లేదని వాటిలో కూడా కోత విధిస్తున్నారు. ఇందులో లోపాలను సరిచేసి పేదలను ఆదుకోవాల్సింది పోయి బడా మాల్స్‌ వారికి వీటిని కట్టబెడతారట. గ్రామాల్లో రేషన్‌ షాపుల స్థానంలో మాల్స్‌ పెడతానని చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు. బాబు రాకముందు రేషన్‌ షాపుల్లో ఇచ్చే సరుకుల సబ్సిడీ బిల్లే రూ.2000 కోట్ల నుంచి రూ.3000 కోట్లు ఉండేది. ఇప్పుడేమో రిలయన్స్‌ వాళ్లు వచ్చి 20 శాతం తక్కువకు అమ్మే విధంగా మాల్స్‌ పెడతారంటున్నావు. ఇంకా మీ సంస్థ (హెరిటేజ్‌)తో భాగస్వామ్యం ఉన్న ఫ్యూచర్‌ గ్రూపునకూ ఇస్తామంటున్నారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికే ఈ ప్రక్రియను మొదలు పెట్టారని మనవి చేస్తున్నా' అని జగన్ చెప్పారు.

బాబు వస్తే..

బాబు వస్తే..

‘ఎన్నికలపుడు జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు. జాబు ఇవ్వక పోతే ప్రతి ఇంట్లో నిరుద్యోగికి రూ.2000 భృతి ఇస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 45 నెలలైంది. ఇప్పటి వరకూ రూ.90 వేలు ప్రతి ఇంటికీ బాకీ పడినట్లే కదా? అని అడుగుతున్నా' అని జగన్ ప్రజలనుద్దేశించి అన్నారు.

ఇలా మోసం చేసిన బాబు..

ఇలా మోసం చేసిన బాబు..

‘బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలన్నా, రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ కావాలన్నా తాను ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాక పోగా బ్యాంకులు ఆ బంగారాన్ని వేలం వేస్తున్నట్లు నోటీసులు మాత్రం అందుతున్నాయి. మాఫీ సొమ్ము రైతు రుణాల వడ్డీకి కూడా సరిపోవడం లేదు. పొదుపు సంఘాల మహిళలనూ ఇదే రీతిలో దారుణంగా మోసగించారు. ఇవాళ ఒక్క రూపాయి కూడా మాఫీ కాక పోగా వడ్డీ లేని రుణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు ప్రతి కులాన్నీ మోసం చేశారు' అని జగన్ మండిపడ్డారు.

అంతా అవినీతి మయమే

అంతా అవినీతి మయమే

‘రాష్ట్రంలో యువకులకు చంద్రబాబు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కొద్దో గొప్పో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉండే ప్రత్యేక హోదాను అమ్మేశారు. ఎన్నికలపుడు 15ఏళ్లు హోదా కావాలన్న వారు, ఇపుడు ఏకంగా అమ్మేశారు. ఇవాళ కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు, రాజధాని భూములు.. చివరికి దేవాలయ భూములను కూడా వదల్లేదు. అంతా అవినీతి మయమే. ఈ ముఖ్యమంత్రి వల్ల జన్మభూమి కమిటీల మాఫియా ఊరూరా విస్తరించింది. పింఛను కావాలన్నా, బియ్యం కావాలన్నా, మరుగుదొడ్లు మంజూరు కావాలన్నా వారికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి' అని జగన్ ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP president YS Jaganmohan Reddy on Tuesday lashed out at Andhra Pradesh CM Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X