కేసీఆర్ ఇంటికెళ్లిన వైఎస్ జగన్-సర్జరీ తర్వాత ఆరోగ్య పరిస్ధితిపై ఆరా..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్.. నందినగర్ లోని ఇంట్లో ఉంటున్న కేసీఆర్ ను వెళ్లి కలిసారు.
Recommended Video

సీఎం జగన్ ను కేసీఆర్ తనయుడు కేటీఆర్, ఇతర నేతలు రిసీవ్ చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ వద్దకు వెళ్లి సీఎం జగన్ కాసేపు మాట్లాడారు. తుంటి శస్త్ర చికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు.

గత నెలలో తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంట్లో జారి పడిన కేసీఆర్ తుంటికి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఇంకా విశ్రాంతిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ను ఆయన బెడ్ మీద నుంచే పలకరించారు. కేసీఆర్ పక్కనే కుర్చీలో కూర్చునే జగన్ ఆయనతో మాట్లాడారు. శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్య పరిస్ధితితో పాటు నడక, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పలుమార్లు సీఎం జగన్ ఆయన్ను వెళ్లి కలిశారు. అయితే ఉన్నంట్లుండి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదాలు తలెత్తడంతో ఇద్దరూ కలుసుకోవడం మానేశారు. అయితే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం కలిసేవారు.

కానీ తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్, కేసీఆర్ ఇద్దరూ కలవరం ఇదే తొలిసారి. దీంతో కేసీఆర్ ఆరోగ్యంతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy met BRS President and former Chief Minister Sri K. Chandrashekar Rao in Hyderabad today. pic.twitter.com/fcXvY9n5HQ
— BRS Party (@BRSparty) January 4, 2024
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications