గ్రేటర్ విశాఖపై దృష్టి పెట్టిన జగన్- నేడు తాడేపల్లి కేంద్రంగా.. !!

ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి తిరిగి బలోపేతం చేయడానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నేడు గ్రేటర్ విశాఖపట్నం నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఉదయం 11 గంటలకు ఈ భేటీ ఏర్పాటైంది. దీనికి రీజినల్ కోఆర్డినేటర్లు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు హాజరు కానున్నారు.

ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ ఈ భేటీని నిర్వహించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే.. మజ్జి శ్రీను టీడీపీలో చేరడం, భీమిలీ నియోజకవర్గం పార్టీ ఇన్ ఛార్జీగా బొత్స అనూషను నియమించడం.. వంటి పరిణామాల అనంతరం అక్కడ తలెత్తిన పరిస్థితులపై ఆరా తీస్తారని తెలుస్తోంది.

YS Jagan will meet former local body representatives party leaders from Greater Visakhapatnam today

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నాన్ని జగన్ పరిపాలనా రాజధానిగా ప్రకటించి, దాని ప్రగతికి మొదటి ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ చోటు చేసుకుంటోన్న విశాఖకు ప్రాధాన్యతలేమిటనేది జగన్ వివరించే అవకాశం ఉంది. అలాగే.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ వర్గాల మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవడం, అక్కడ నెలకొన్న స్థానిక సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలా ముందడుగు వేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తారని తెలుస్తోంది.

మజ్జి సిరి భర్త అవుట్: జగన్ దిద్దుబాటు- రాత్రికి రాత్రి ఉత్తర్వులు
మజ్జి సిరి భర్త అవుట్: జగన్ దిద్దుబాటు- రాత్రికి రాత్రి ఉత్తర్వులు

నగర వాసులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలు.. ప్రత్యేకించి మంచినీటి కోసం ఇటీవలే స్థానికులు రోడ్డెక్కడం, జీవీఎంసీ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, ఇతర ప్రజా సమస్యలపై పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను జగన్ ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలతో జగన్ విడివిడిగా సంభాషించే అవకాశం ఉందని, వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా పార్టీపరంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని వివరిస్తోన్నాయి.

ఏపీ తీరానికి సమీపిస్తోన్న వాయుగుండం: ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ తీరానికి సమీపిస్తోన్న వాయుగుండం: ఈ జిల్లాల్లో వర్షాలు

వైఎస్సార్‌సీపీ శ్రేణులు లేదా స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీ, జనసేన వైపు వెళ్లకుండా చూడటానికీ జగన్ ప్రాధాన్యత ఇస్తారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో సముచిత స్థానం, తగిన ప్రాధాన్యత కల్పిస్తామని జగన్ స్పష్టమైన హామీ ఇవ్వొచ్చనీ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+