కొడుకు ప్రేమ- పెళ్లిపై మౌనం వీడిన వైఎస్ షర్మిల..
YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతుల తనయుడు వైఎస్ రాజా రెడ్డి (YS Raja Reddy) ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
పెళ్లి కూతురి పేరు ప్రియా అట్లూరి (Priya Atluri). చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ దేశ పౌరసత్వం కూడా ఆమెకు ఉంది. వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరిది ప్రేమ వివాహం. నాలుగు సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్నారు.

ఉన్నత చదువుల కోసం రాజా రెడ్డి.. అమెరికాకు వెళ్లినప్పుడు ప్రియా అట్లూరి పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. వారి ప్రేమ వివాహానికి అటు వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతులు, ఇటు ప్రియ అట్లూరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు.
అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచిలర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేసుకున్నారు వైఎస్ రాజా రెడ్డి. యూనివర్సిటీ నుంచి ఇదివరకు పట్టా అందుకున్నారు. వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరిది కులాంతర వివాహం అవుతుంది. వైఎస్ షర్మిలది కూడా కులాంతర వివాహమేననే విషయం తెలిసిందే. ఆమె భర్త అనిల్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
తన తనయుడి ప్రేమ- పెళ్లిపై తొలిసారిగా స్పందించారు వైఎస్ షర్మిల. రాజారెడ్డి- అట్లూరి ప్రియ వివాహం కొద్దిరోజులుగా వార్తలు వస్తోన్నప్పటికీ.. వాటిపై ఆమె ఎక్కడా రియాక్ట్ కాలేదు. కొత్త సంవత్సరం సందర్బంగా ఈ విషయంపై మౌనం వీడారు. రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన కొత్త వివరాలను వెల్లడించారు.

ఈ నెల 18వ తేదీన రాజారెడ్డి- అట్లూరి ప్రియ నిశ్చితార్థం వేడుకను నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీన వివాహ జరుపనున్నట్లు చెప్పారు. దీనికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోన్నామని అన్నారు.
ఈ శుభ సందర్భంగా మంగళవారం కుటుంబ సమేతంగా, కాబోయే వధూవరులతో కలిసి కడప జిల్లాలోని ఇడుపులపాయలో గల వైఎస్ఆర్ ఘాట్‌ను సందర్శించనున్నామని షర్మిల చెప్పారు. తొలి లగ్న, ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకుంటామని పేర్కొన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications