కడప ఎంపీగా పోటీపై షర్మిల భావోద్వేగం-వైఎస్ కుటుంబంలో చీలిక-అవినాష్ ను ఓడించేందుకే..!

ఏపీలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ అదృష్టం పరీక్షించుకోబోతున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల.. ఇవాళ ఇడుపులపాయలో కీలక ప్రకటన చేశారు. కడప ఎంపీగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన షర్మిల.. అందుకు గల కారణాలను వివరించే ప్రయత్నంలో భావోద్వేగానికి గురయ్యారు. తన నిర్ణయంతో రేపు ఏం జరగబోతోందో కూడా ఆమె చెప్పేశారు. అంతే కాదు తన పోటీ టార్గెట్ ఏంటో కూడా పీసీసీ ఛీఫ్ వెల్లడించారు.

కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గా ఈసారి నిలబడుతున్నానని, వైఎస్సార్ బిడ్డ నిలబడుతుందని షర్మిల తెలిపారు. ఈ నిర్ణయం తనకు సులువైంది కాదన్నారు. ఈ నిర్ణయం తన కుటుంబాన్ని చీలుస్తుందని తెలుసన్నారు. వైఎస్సార్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుంది అని తెలుసన్నారు. అయినా తప్పని సరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయమని తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి తన అన్న అని, ఆన్న అంటే తనకు ద్వేషం లేదని పేర్కొన్నారు. జగన్ తన రక్తమని, ఎన్నికల్లో తాను చెల్లి కాదు తల్లి అన్నాడని గుర్తు చేసుకున్నారు. కానీ సీఎం అయ్యాక మారిపోయాడన్నారు. ఈ జగన్ తనకు పరిచయం లేదన్నారు.

ys sharmila emotional reaction on contesting in kadapa mp seat termed ys jagan avinash reasons

జగన్ తాను అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశాడని, హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడని షర్మిల ఆరోపించారు. కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడన్నారు. ఇదే తట్టుకోలేక పోయానన్నారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదని, హత్య చేసిన వాళ్ళు,చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవన్నారు. అధికారం వాడుకొని వాళ్ళనే జగన్ రక్షిస్తున్నాడని విమర్శించారు. అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నాడన్నారు.
మళ్ళీ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం తట్టుకోలేక పోయానన్నారు.

వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని జగన్ ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. ఇది తమకు చాలా ఆలస్యంగా అర్థం అయిందన్నారు. సాక్షి చానెల్ తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని, ప్రజలు హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇస్తే హర్షించరు అని తెలిసి మళ్ళీ టిక్కెట్ ఇచ్చారన్నారు. వైఎస్సార్,వివేకా రామ లక్ష్మణుడి లా ఉండేవాళ్ళని, వివేకా ఆఖరి కోరిక తనను ఎంపీగా చూడాలని అన్నారు. కానీ తనకు అప్పట్లో అదెందుకో అర్ధం కాలేదని, ఇప్పుడు అర్దం అవుతోందన్నారు. తాను హత్యా రాజకీయాలకు వ్యతిరేకి అని, ఓ హంతకుడు పార్లమెంట్ మెట్లు ఎక్కకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+