YS Sharmila: ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం; ఇప్పుడు ఏపీపై కాంగ్రెస్ విసిరిన అస్త్రం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో ఏపీలో వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఓ రకంగా ప్రయాణం చేస్తే, ఏపీలో వైఎస్ షర్మిల, ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా ఎంట్రీ ఇవ్వడంతో మరోరకంగా మారనున్నాయి.

Recommended Video

    APCC Chief Ys Sharmila vs Ys Jagan ఉత్కంఠ రేపుతున్న వార్..| Congress | Telugu Oneindia

    ఏపీలో పొలిటికల్ గేమ్ ఛేoజర్ గా వైయస్ షర్మిల ఏపీ రాజకీయాలలో ఆమె ఎంట్రీ తో మారారు అన్న చర్చ ప్రస్తుతం జనాలలో జోరుగా జరుగుతుంది. వైఎస్ షర్మిల.. అప్పుడు జగనన్న వదిలిన బాణం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ విసిరిన అస్త్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయి ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి ఆమె పగ్గాలు చేపడుతున్నారు.

     YS Sharmila is the weapon thrown by Congress on AP.. hot topic!!

    ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకురావడానికి, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయపథం వైపు నడిపించడానికి వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ గా పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల త్వరలో జరగనున్న ఎన్నికల సమరంలో ప్రత్యర్థి పార్టీలపై తొడకొట్టి కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టే ప్రయత్నాలు చేయనున్నారు.

    ఒక పక్క ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన, టిడిపి పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక బిజెపి పొత్తుల విషయంలో డైలమాలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలంగా వాయిస్ వినిపించగల వైయస్ షర్మిల కు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పట్టం కట్టడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

    వైయస్ షర్మిల అధికార వైసీపీతో తల పడతారా? ఒకప్పుడు తాను ప్రచారం చేసిన పార్టీపై సమర శంఖం పూరిస్తారా? ప్రత్యర్థి పార్టీలతో పొత్తులతో కలిసి వెళ్తారా? లేక వచ్చే ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళతారా? అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది.

    ఇక వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రంగంలోకి దిగి వైయస్ జగన్ ను టార్గెట్ చేసే చాన్స్ లేకపోలేదు అన్నది జరుగుతున్న చర్చ. ఒకవేళ అదే జరిగితే జగన్ సైలెంట్ గా ఉంటారా? జగన్ కూడా షర్మిలను టార్గెట్ చేస్తే ఇద్దరి మధ్య వార్ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతుంది. అన్నా చెల్లెళ్ళ వార్ లో లాభం జరిగేది ఎవరకి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+