గుడ్ల వల్లేరు ఘటనపై షర్మిల షాక్-ఆడబిడ్డ తల్లిగా భయపడ్డా-చర్యలకు డెడ్ లైన్..!
ఏపీలోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్దినుల బాత్ రూమ్ ల్లో రహస్య కెమెరా పెట్టి 300 వీడియోలు తీసి ఆమ్ముకున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంతో రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే క్రమంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా షాకయ్యారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని వైఎస్ షర్మిల కోరారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. చదువు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే...వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం అన్నారు.

కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇది సజీవ సాక్ష్యమని షర్మిల విమర్శించారు. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణమన్నారు. కాసుల కక్కుర్తి తప్పా భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అన్నారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలన్నారు. తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలి. సీనియర్ ఐపిఎస్ అధికారులతో విచారణ జరగాలన్నారు. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలన్నారు. రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదని, కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు.
ఆడపిల్లల బాత్ రూముల్లో హెడెన్ కెమెరాలు..
— YS Sharmila (@realyssharmila) August 30, 2024
3వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలి. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు..…
మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనని షర్మిల తెలిపారు. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తానని హెచ్చరించారు. విద్యార్థినిలతో మాట్లాడుతానని, వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications