వైఎస్ కుటుంబంలో మరోసారి పోటీ ! ఫ్యామిలీని ఒప్పించబోతున్న షర్మిల-తర్వాతే ప్రకటన..
ఏపీలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్ధులుగా వైఎస్ కుటుబం సభ్యులైన సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ పడతారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటివరకూ వైఎస్ కుటుంబంలో ఒకే ఒక్కసారి 2011లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ వైసీపీ తరఫున, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి పోరు ఆసక్తి రేపుతోంది.
వైఎస్ వివేకా హత్య తర్వాత నెలకొన్న పరిస్దితుల్ని గత ఎన్నికల్లో రాజకీయంగా వాడుకున్న వైసీపీ.. కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఆ తర్వాతే సీన్ మారిపోయింది. వివేకా కుమార్తె సునీత తన అన్న, సీఎం జగన్ పై పోరుకు సిద్దమయ్యారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టు వరకూ వెళ్లి సాధించుకున్నారు. అయితే సీబీఐ దర్యాప్తు కూడా నత్తనడకన సాగడానికి జగనే కారణమని విమర్శలు గుప్పిస్తున్న సునీతకు ఇప్పుడు అన్నపై విభేదిస్తున్న సోదరి వైఎస్ షర్మిల కూడా తోడయ్యారు. దీంతో కడప జిల్లాలో రాజకీయం మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ షర్మిల ఉమ్మడిగా వివేకా వర్ధంతి సభ కూడా నిర్వహించారు. ఇందులో వైసీపీకి తిరిగి ఓటేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా షర్మిల బరిలోకి దిగేలా హైకమాండ్ ఒత్తిడి తేవడంతో ఆమె పోటీకి సిద్దమవుతున్నారు. దీనిపై కుటుంబంలో అంతర్మథనం సాగుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులే పోటీకి దిగితే కడప జిల్లాలో వైఎస్ కుటుంబ ప్రతిష్ట ఏం కావాలన్న దానిపై వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల రెండ్రోజుల్లో ఇడుపులపాయకు వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించబోతున్నారు.
వివేకా హత్య తర్వాత పరిస్దితులు, అన్న జగన్ తో తాను విభేదించడానికి గల కారణాలు వివరించి కుటుంబ సభ్యుల్ని తన పోటీకి షర్మిల ఒప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరో రెండు రోజుల్లో ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు షర్మిల సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేకా హంతకుడిగా సునీత, షర్మిల ఆరోపిస్తున్న అవినాష్ పై పోటీకి దిగితే జనంలోనూ సానుభూతి లభిస్తుందని అంచనా వేసుకుంటున్నారు.
-
ఏపీలో ఆ జిల్లాల్లో పెనం మీద ఉన్నట్టే- అత్యధిక ఉష్ణోగ్రత -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications