వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల, అప్పుల వివరాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

షర్మిల మొత్తం ఆస్తుల విలువ ఇదే
వైయస్ షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో ఆమె ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. షర్మిల తొలిసారి తన ఆస్తుల వివరాలను వెల్లడించడంతో ప్రతి ఒక్కరి ఫోకస్ షర్మిల ఆస్తులపైన పడింది. ఇక తన ఎన్నికల అఫిడవిట్లో షర్మిల పలు ఆసక్తికర విషయాలను కూడా ప్రస్తావించారు. షర్మిల తన మొత్తం ఆస్తులు విలువ 182.82 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు.

YS Sharmila took Rs 82 crores debts from ys jagan and ys bharathi

షర్మిల, అనిల్ ల చరాస్తులు ఇవే
ఇందులో చరాస్తులు 123.26 కోట్లని షర్మిల పేర్కొన్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ 45 కోట్ల రూపాయల విలువైన చరాస్తులను కలిగి ఉన్నారని తెలిపారు. షర్మిలకు స్థిరాస్తులు 9.29 కోట్ల రూపాయలుగా ఉన్నాయని, ఆమె భర్తకు 4.05 కోట్ల రూపాయలు స్థిరాస్తులు ఉన్నాయని షర్మిల తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

జగన్ వద్ద, వైఎస్ భారతి వద్ద అప్పు తీసుకున్న షర్మిల
3.69 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 4.61 కోట్ల విలువ చేసే జెమ్ స్టోన్స్ ఆభరణాలు తన వద్ద ఉన్నట్టుగా ఉన్నట్టుగా షర్మిల ప్రకటించారు.అంతేకాదు ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న షర్మిల అన్న జగన్ వద్ద 82.58 కోట్ల రూపాయల అప్పు చేసినట్టు, వదిన వైయస్ భారతి రెడ్డి వద్ద 19.56 లక్షలు అప్పు తీసుకున్నట్టు వెల్లడించారు.

అన్నా వదినల వద్ద షర్మిల అప్పే హాట్ టాపిక్
వైఎస్ షర్మిలకు సంవత్సరానికి 97.14 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, ఇక ఆమె భర్త అనిల్ కుమార్ కు మూడు లక్షల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. తనపై మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయని షర్మిల వెల్లడించారు. ఈ అఫిడవిట్ మొత్తంలో షర్మిల అన్నా, వదినల వద్ద అప్పు తీసుకున్నానని చెప్పటం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. వాళ్ళను తిడుతూనే వైఎస్ జగన్, భారతి వద్ద వైఎస్ షర్మిలమ్మ అప్పుల చిట్టా షాక్ కు గురిచేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+