నవరత్నాలు సరే.. ఈ నవ సందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్యా.. జగన్‌పై వైఎస్ షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరి వైయస్ షర్మిలకు మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. షర్మిలను టార్గెట్ చేస్తూ జగన్, జగన్ ను టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖాస్త్రాన్ని సంధించారు.

జగన్ కు లేఖ రాసిన వైఎస్ షర్మిల
ఇక ఆ లేఖలో ఆమె నవరత్నాలు సరే.. మాకు ఉన్న నవ సందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్య అంటూ పేర్కొన్నారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుందని చెబుతున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని కొనసాగిస్తామని ప్రచారం చేసుకుంటున్నారని, దీంతో అసలు నవరత్నాల వ్యవహారం పైన షర్మిల జగన్ ను టార్గెట్ చేసిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

YS Sharmila wrote letter to ys jagan with 9 doubts on navaratnalu welfare schemes

షర్మిల నవ సందేహాలు
ఇక్కడ నవ సందేహాల పేరుతో బహిరంగ లేఖ రాసిన వైయస్సార్ షర్మిల, అన్న వైయస్ జగన్ తనకు సమాధానం చెప్పాలని కోరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక షర్మిల సంధించిన నవ సందేహాలు ఏమిటి అంటే ..
ఎస్సీ, ఎస్టీ రైతులకు వైయస్ హయాంలో సాగు భూములు ఇచ్చారు.. వాటిని ఎందుకు ఆపేశారు?
గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ ఎస్టీల 28 పథకాలను ఎందుకు నిలిపివేశారు?

ఎస్సీ, ఎస్టీల విషయంలో ఊపిరాడని ప్రశ్నలు సంధించిన షర్మిల
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించడం నిజం కాదా?
ఎస్సీ ఎస్టీలలో వెనుకబడిన వారికి ఎందుకు ఆపేశారు?
వైసీపీలో ఎస్సీ, ఎస్టీ స్థానాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదు?
అంబేద్కర్ విదేశీ విద్య దీవెన పథకంలో అంబేద్కర్ పేరును ఎందుకు తీసేసారు?
అంబేద్కర్ స్టడీ సర్కిల్ లకు డబ్బులు ఎందుకు ఇవ్వడం ఆపేశారు?

వైయస్ జగన్ షర్మిల ప్రశ్నలకు సమాధానం చెబుతారా లేదా..
రైతులకు సాగు భూములు పంచే కార్యక్రమం ఎందుకు ఆపేశారు?
సొంత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంత బాబును మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అంటూ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని నవ సందేహాల పేరుతో ప్రశ్నించారు వైయస్ షర్మిల. ఇక ఈ ప్రశ్నల ద్వారా ఎస్సీ ఎస్టీలకు జగన్ అన్యాయం చేశారని చెప్పకనే చెప్పారు. మరి వైయస్ జగన్ షర్మిల ప్రశ్నలకు సమాధానం చెబుతారా లేదా? అన్నది తెలియాల్సి ఉంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+