ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకా గెలుస్తారు, ఈ ఫలితాలు సంచలనాలకు కారణమౌతాయి

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టిస్తాయని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషాలు చెప్పారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి విజయం సాధిస్తారని వారు ధీమాను వ్యక్తం చేశారు.గెలుపుపై ఆశలు పెట్టుకొన్న టిడిపికి ఓటర్లు తగిన బుద్ది చెబుతారన్నారు.

ys vivekananda reddy will win in kadapa mlc elections

ఆంద్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 17, ఎన్నికలు జరిగాయి. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన కడప స్థానంపై అధికార టిడిపి, విపక్ష వైసిపి లు ఆశలు పెట్టుకొన్నాయి.

వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడిస్తామంటూ పోటింగ్ పూర్తైన వెంటనే టిడిపి అభ్యర్థులు ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ys vivekananda reddy will win in kadapa local body mlc eletions said ysrcp mla ravindranath reddy and others on sunday .
Please Wait while comments are loading...