ఆస్కార్ రేంజ్ యాక్టర్: ఆ విషయంలో చంద్రబాబును సమర్థించిన విజయసాయి రెడ్డి

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డదారు. సెటైర్లు సంధించారు. ఇటీవలే విడుదలైన 67వ జాతీయ చలనచిత్ర అవార్డులతో చంద్రబాబును ముడిపెట్టి మరీ విమర్శలు సంధించారు. ఈ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌‌పైనా అదే రేంజ్‌లో కామెంట్స్ చేశారు.

చంద్రబాబును విజయసాయి రెడ్డి ఆస్కార్ రేంజ్ నటుడిగా పోల్చారు. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలో చంద్రబాబు పేరు లేకపోవడం తనకు నిజంగా బాధ కలిగించిందని పేర్కొన్నారు. చంద్రబాబు వంటి మహానటుడికి జాతీయస్థాయి అవార్డు దక్కకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆస్కార్ రేంజ్ నటుడికి కనీసం జాతీయ అవార్డు కూడా రాకపోవడమేంటీ అని ప్రశ్నించారు. ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో చంద్రబాబు అద్భుతంగా నటించాడని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

YSRC MP Vijayasai Reddy satires on Chandrababu as great actor who missed National award

ఈ విషయంలో సాయిరెడ్డి.. మాజీమంత్రి నారా లోకేష్‌ను కూడా వదల్లేదు. నారా లోకేష్‌ను చిట్టి నాయుడిగా అభివర్ణించారు. కనీసం నారా లోకేష్‌కైనా సహాయ నటుడు అవార్డు దక్కాల్సిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిద్దరూ చేసిన నటన వృధా అయినట్టుందని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి- ఎన్నికల గుర్తు రహితంగా కొనసాగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని, వైసీపీ పతనం ఈ ఎన్నికలతో ఆరంభమైందంటూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+