వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డబుల్' షాక్: టిడిపిలో చేరిన గొట్టిపాటి, జగన్‌ని పట్టించుకోవద్దని బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుధవారం నాడు వరుసగా రెండు షాకులు తగిలాయి. ఉదయం మైసూరా రెడ్డి పార్టీకి రాజీనామా చేయగా, మధ్యాహ్నం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ టిడిపిలో చేరారు.

విజయవాడలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువా కప్పి గొట్టిపాటి రవి కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. గొట్టిపాటితో పాటు పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్‌ విండో ఛైర్మన్‌లు టిడిపిలో చేరారు.

జగన్ పైన చంద్రబాబు ఆగ్రహం

గొట్టిపాటి చేరిక సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. భూముల విక్రయాల్లో అవకతవకలు లేకుండా చేస్తున్నామని చెప్పారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నామన్నారు. అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఫైబర్ గ్రిడ్ సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారు తన పైన ఆరోపణలు చేస్తున్నారని.. వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం తాను రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని చెప్పారు. కొంతమంది పని గట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతిపరుల ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

YSRCP Addanki MLA Gottipati joins TDP

మేం చంద్రబాబు నాయకత్వంలోనే పని చేస్తాం

తాను చంద్రబాబు నాయకత్వంలోనే పని చేస్తామని గొట్టిపాటి అన్నారు. కరణం బలరాం చెప్పినట్లుగా తాను కేసులు ఎత్తివేయించుకునేందుకు, అక్రమాస్తులు కాపాడుకునేందుకు తాను టిడిపిలోకి రావడం లేదన్నారు. తాను వాటి గురించి వచ్చానని నిరూపిస్తే ఇప్పుడే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు.

నాయకులతో కలిసి పని చేయడం కాదని, కార్యకర్తలందరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, బాబు నాయకత్వంలో పని చేస్తామన్నారు. హత్యా రాజకీయాలు చేసే వారితో ఇబ్బంది ఉందని చెప్పారు. నియోజక వర్గ కార్యకర్తలతో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.

బాబుపై పుస్తకాలు వేసే నైతిక హక్కు లేదు: జగన్‌పై టిడిపి

బ్రిటిష్ వారితో చేతులు కలిపి వైయస్ కుటుంబం అరాచకాలకు పాల్పడిందని కడప జిల్లా టిడిపి నేత రాంగోపాల్
రెడ్డి బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎంతోమందిని హత్య చేసిన చరిత్ర వైయస్ కుటుంబానికి ఉందన్నారు. జగన్ కుటుంబ చరిత్ర తెలిస్తే ప్రజలు దేశం నుంచి వెలివేస్తారని విమర్శించారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జగన్‌కు బాబుపై పుస్తకాలు వేసే నైతిక హక్కు లేదన్నారు.

English summary
YSRCP Addanki MLA Gottipati joins TDP in the presence of AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X