Rayalaseema: సీమలోనూ కూటమి దూకుడు-వైసీపీ కకావికలం-మంత్రుల ఓటమిబాట..!
ఏపీలో ఇవాళ వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. కోస్తాంధ్రతో పాటు వైసీపీకి బలమైన రాయలసీమలోనూ కూటమి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కూటమి దూకుడు ధాటికి సీమలో వైసీపీ కోటలు కకావికలు అవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లకు ఏకంగా 49 సీట్లు జగన్ కు కట్టబెట్టిన ఓటర్లు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారని ఫలితాల ట్రెండ్ సూచిస్తోంది.
రాయలసీమలో ఈసారి పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధులు చాలా చోట్ల ఓటమి బాటలో ఉన్నారు. వీరిలో పలువురు సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సీమలో ఇప్పటికే పలుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఇవాళ వెనుకంజలో ఉన్నారు. తద్వారా రాయలసీమలోనూ ఓటర్లు ఈసారి భిన్నంగా స్పందించినట్లు అర్థమవుతోంది. వెనుకంజలో ఉన్న మంత్రుల్లో సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.

రాయలసీమలో ఈసారి కడప, కర్నూలు జిల్లాలో అయినా వైసీపీ లీడ్ కొనసాగుతుందని అంతా భావించారు. కానీ ఈ రెండు జిల్లాల్లోనూ కూటమి దూకుడు కనిపిస్తోంది. కేవలం కడప జిల్లాలో మాత్రమే వైసీపీ లీడ్ కొనసాగే పరిస్ధితి కనిపిస్తోంది. మిగిలిన కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కూటమి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే దాదాపుగా రాయలసీమలో 2019 నాటి ఫలితం రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications