మండలి ఛైర్మన్ కు 6గురు వైసీపీ ఎమ్మెల్సీల షాక్..! రాజీనామాలపై ట్విస్ట్ ..!

ఏపీలో గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు గతేడాది కూటమి సర్కార్ వచ్చాక అధికార పార్టీల్లోకి ఫిరాయించారు. అదే సమయంలో రాజీనామాలు కూడా చేశారు. ఈ మేరకు లేఖల్ని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజుకు పంపారు. అయితే ఆ రాజీనామాలు ఇప్పటివరకూ ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో వీరి రాజీనామాలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఇవాళ గతంలో రాజీనామాలు చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలను మండలి ఛైర్మన్ పిలిపించారు. రాజీనామాలకు కట్టుబడే విషయంలో వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని భావించారు. దీంతో ఆయా ఎమ్మెల్సీలు ఇవాళ మండలికి వచ్చారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ మోషేను రాజుకు, ఎమ్మెల్సీలకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తాము రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఎందుకు పార్టీ మారానుకుంటున్నామో ఆయనకు వారు వివరించారు.

ysrcp defected mlcs waiting for chairman approval clarified stand on continuation

వైసీపీలో ఉండలేక రాజీనామా చేశామని చాలాసార్లు చెప్పినట్లు ఆరుగురు ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ కు తెలిపారు. ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి స్పందనగా వారు.. జగన్‌ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని తెలిపారు. పదవీకాలం తక్కువే ఉన్నందున కొనసాగాలని మండలి ఛైర్మన్‌ వారికి సూచించారు.

ysrcp defected mlcs waiting for chairman approval clarified stand on continuation

అలాగే రాజీనామా ఉపసంహరణ విషయంలో పునరాలోచన ఏమైనా ఉందా అని కూడా ఛైర్మన్‌ వారిని అడిగారు. జగన్‌ వద్ద, వైసీపీలో కొనసాగే ఉద్దేశం లేకే రాజీనామాలు చేసినట్లు ఎమ్మెల్సీలు వెల్లడించారు. దీంతో ఆయన కూడా చేసేది లేక ఈ విచారణ ముగించినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి రాజీనామాల ఆమోదంపై ఛైర్మన్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజీనామాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీల్లో కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీత ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+