రాయలసీమ లిఫ్ట్ కట్టాల్సిందే..! ఉద్యమానికి వైసీపీ రెడీ..!
ఏపీలో కృష్ణానదిపై గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించి మధ్యలో ఆపేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి సర్కార్ పూర్తిగా రద్దు చేసేసింది. ఈ నేపథ్యంలో విపక్ష వైఎస్సార్సీపీ దీన్ని అందిపుచ్చుకుని పోరాటం ప్రారంభించింది. ఇప్పుడు దాన్ని రైతులకు విస్తరించాలని భావిస్తోంది. రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని, పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ స్పష్టం చేశారు.
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంజీవని లాంటి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ప్రారంభించాల్సిందేనని, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్టును ఆపడంపై నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అందుకే సోమశిల కండలేరు విజిట్‌కి టీడీపీ పిలుపునిచ్చినా వారి వెంట వెళ్లడానికి రైతులు నిరాకరించారని చెప్పారు. చంద్రబాబు తక్షణం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించకపోతే సాగునీటి రంగ నిపుణులు, రైతులతో కలిసి వైయస్సార్సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

చంద్రబాబు సీఎం అయ్యాక తీవ్రంగా నష్టపోతున్నామని, రాష్ట్రంలో ఒక పక్క రైతులు కన్నీరుమున్నీరవుతుంటే ఇంకోపక్క పుండు మీద కారం చల్లినట్టుగా సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టును ఆపేశారని కాకాణి విమర్శించారు. దీనివల్ల రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ చంద్రబాబు రాయలసీమ ప్రజల దృష్టిలో చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు.

రాయలసీమ లిప్ట్ ద్వారా నీరు తెచ్చుకోగలిగితే రైతులకు ఎలాంటి నష్టం జరగదని మాజీ సీఎం వైయస్ జగన్ భావించి, ప్రాజెక్టును వాయువేగంతో ముందుకు తీసుకెళ్లారని, కానీ రైతు ఆవేదనను పట్టించుకోకుండా సంజీవని లాంటి ప్రాజెక్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశారన్నారు. చంద్రబాబుతో నేను క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో మాట్లాడి రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేయించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను చంద్రబాబు ఇంతవరకు ఖండించలేదని గుర్తుచేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications