నంద్యాలా ? గుంటూరా ? అలీకి ఎంపీ సీటుపై జగన్ డైలమా ?

ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కొత్త సమస్యలకు కారణమవుతోంది. అదే సమయంలో ముస్లిం అభ్యర్ధికి లోక్ సభ ఎంపీ సీటు కేటాయించేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాల్లోనూ అదే పరిస్దితి కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో ఎంపీ సీటుకు పోటీ చేయించే స్ధాయిలో అంగబలం, అర్ధబలం కలిగిన ముస్లింలు లేకపోవడంతో వైసీపీకి అండగా ఉంటున్న టాలీవుడ్ నటుడు అలీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.

అయితే ఇక్కడే సమస్య ఎదురవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తరఫున పలువురు ముస్లిం అభ్యర్ధులు ఎంపీలుగా లోక్ సభకు, రాజ్యసభకు వెళ్లారు. కానీ వైసీపీ రాజ్యసభ సీటును ముస్లింలకు ఇస్తామని ఎప్పటి నుంచో హామీ ఇస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్ధిని లోక్ సభకు నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం నంద్యాల, కర్నూలు లోక్ సభ సీట్లను పరిశీలించింది.

ysrcp in dilemma over loksabha mp seat to muslim candidate, ali prefers guntur than nandyal?

అయితే కర్నూలులో సమీకరణాల కారణంగా బీసీ అభ్యర్ధి అయిన మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించక తప్పలేదు. అలాగని నంద్యాలలో ఎంపీగా ముస్లిం అభ్యర్ధిని నిలబెడదామని చేస్తున్న ప్రయత్నాలూ ముందుకు సాగడం లేదు. దీనికి కారణం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేత పోచ బ్రహ్మానందరెడ్డి స్ధానంలో ముస్లింకు అవకాశం ఇస్తే రెడ్ల నుంచి వ్యతిరేకత తప్పేలా లేదు. పోచను మార్చినా మరో రెడ్డి నేతకు టికెట్ ఇస్తే సరి. లేకపోతే ఇబ్బదులు తప్పేలా లేవు. అదే సమయంలో నంద్యాల నుంచి పోటీకి అలీ కూడా సిద్ధంగా లేరు.

దీంతో ఇప్పుడు అలీ ఎప్పటి నుంచో కోరుకుంటున్న గుంటూరు ఎంపీ సీటులో పోటీకి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు టీడీపీ కమ్మ ఓట్లతో పాటు ఇతర ఓట్లను ఆయనకు వ్యతిరేకంగా పోలరైజ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరు సీటులో అలీ పేరును పరిశీలించడం లేదు. కానీ గుంటూరే ఇవ్వాలని అలీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సీటుకు కుదరకపోతే అలీను రాజ్యసభకు పంపేందుకే జగన్ మొగ్గు చూపవచ్చని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+